https://oktelugu.com/

RRR Movie: ‘నాటు నాటు’ పాటకు పునీత్​ రాజ్​కుమార్ స్టెప్పులేస్తే?.. వీడియో వైరల్​

RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో జూనియర్​ ఎన్టీఆర్​, మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ హీరోలుగా రానున్న సినిమా ఆర్​ఆర్​ఆర్​. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ప్రోమోలు, పోస్టర్​లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు, విడుదల తేదీ కూడా దగ్గరపడుతుండటంతో సినిమాపై రోజుకో కొత్త అడ్​డేట్​ ఇస్తూ.. సినిమాపై హైప్​ పెంచుతున్నారు. #ಹಳ್ಳಿನಾಟು ft PowerStar⚡@PuneethRajkumar❤️#PuneethRajkumar #KingAPPU pic.twitter.com/lOHjtOtagV — Pramod⚡ (@_PramodAppu1) November 21, 2021 ఇటీవలే విడుదలైన నాటు నాటు పాట ఎంత ఫేమ్​సో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 24, 2021 / 12:43 PM IST
    Follow us on

    RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో జూనియర్​ ఎన్టీఆర్​, మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ హీరోలుగా రానున్న సినిమా ఆర్​ఆర్​ఆర్​. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ప్రోమోలు, పోస్టర్​లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు, విడుదల తేదీ కూడా దగ్గరపడుతుండటంతో సినిమాపై రోజుకో కొత్త అడ్​డేట్​ ఇస్తూ.. సినిమాపై హైప్​ పెంచుతున్నారు.

    ఇటీవలే విడుదలైన నాటు నాటు పాట ఎంత ఫేమ్​సో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తారక్​, చెర్రీలు ఇందులో ఊర మాస్​ స్టెప్పులేస్తూ కనిపించారు. విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ల వ్యూస్​తో దూసుకెళ్లిపోయింది. కాగా ఈ సినిమాలో తారక్, చెర్రీ వేసిన స్టెప్పులను వేస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేశారు. దీంతో పైసా ఖర్చు లేకుండా సినిమాకు భారీ ప్రమోషన్స్​ జరుగుతున్నట్లైంది.

    తాజాగా, ఈ పాటకు కన్నడ పవర్​స్టార్ పునీత్​ రాజ్​కుమార్​ స్టెప్పులేస్తే ఎలా ఉంటుందో చూపిస్తూ.. నెట్టింట్లో ఓ వీడియో ఒకటి వైరల్​ అవుతోంది. పునీత్ నటించిన సినిమాల్లోని స్టెప్పులన్నింటిని కలిపి నాటు నాటు పాటకు సింక్​ అయ్యేలా జత చేశారు.

    Also Read: శంకర్​ సినిమా కోసం చరణ్ కొత్త లుక్​.. నెట్టింట్లో పిక్స్ వైరల్​
    ఈ వీడియో చూసిన పునీత్​ అభిమానులు పునీత్ డ్యాన్స్ అదుర్స్అంటున్నారు. కాగా, ఇటీవలే పునీత్​రాజ్​కుమార్​ మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన అభిమానులు ఇలా స్మరించుకుంటూ..వీడియోలను షేర్​ చేస్తున్నారు.

    డివివి దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతుండగా… ఎన్టీఆర్ కొమరం భీమ్ గా అలరించ నున్నారు. కాగా వీరి సరసన  ఒలీవియా మోరిస్‌, ఆలియా భట్  హీరోయిన్స్ నటిస్తున్నారు. కాగా అజయ్ దేవగన్, శ్రియ , సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

    Also Read: లక్కీఛాన్స్ కొట్టేసిన జబర్దస్ట్ బ్యూటీ.. చిరు సినిమాలో రష్మి?