Homeఎంటర్టైన్మెంట్Pooja Hegde: ఇద్దరు కొడుకులతో కుమ్మేసింది, ఇప్పుడు తండ్రిపై కన్నేసింది... ఆయనతో ఆన్ స్క్రీన్ రొమాన్స్...

Pooja Hegde: ఇద్దరు కొడుకులతో కుమ్మేసింది, ఇప్పుడు తండ్రిపై కన్నేసింది… ఆయనతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి సిద్ధమైన పూజా హెగ్డే

Pooja Hegde: ఫేడ్ అవుట్ దశలో ఉన్న పూజా హెగ్డేకు దర్శకుడు త్రివిక్రమ్ బ్రేక్ ఇచ్చాడు. ప్లాప్స్ లో ఉన్నప్పటికీ ఎన్టీఆర్ వంటి స్టార్ పక్కన పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు. ఎన్టీఆర్-పూజ హెగ్డే కాంబోలో విడుదలైన అరవింద సమేత వీర రాఘవ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తర్వాత ఆమెకు మహర్షి రూపంలో మరో హిట్ పడింది. అల వైకుంఠపురములో మరోసారి త్రివిక్రమ్ ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠపురములో 2020 సంక్రాంతి కానుకగా విడుదలై ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఒక దశలో పూజ హెగ్డేకు వరుస విజయాలు దక్కాయి.

Also Read: నాని ఊర మాస్ సినిమాలు చేయడం వెనక అసలు కారణం ఇదేనా..?

అయితే రాధే శ్యామ్ నుండి ఆమె బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. చేసిన ఒక్క సినిమా హిట్ కాలేదు. ముచ్చటగా మూడోసారి గుంటూరు కారం మూవీలో ఆమెకు త్రివిక్రమ్ అవకాశం ఇచ్చాడు. అనుకోని కారణాలతో గుంటూరు కారం ప్రాజెక్ట్ చేజారింది. హిట్ కొట్టి పూజా చాలా కాలం అవుతున్నా రెట్రో, జన నాయగన్ వంటి భారీ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. కూలీ మూవీలో నటిస్తున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేశారు. ఆమె లుక్ విడుదల చేశారు.

రజినీకాంత్ హీరోగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న కూలీ మూవీలో నాగార్జున కీలక రోల్ చేస్తున్నాడు. కూలీ మూవీలో పూజా హెగ్డేతో నాగార్జున రొమాన్స్ చేయనున్నాడట. పూజా హెగ్డేను ఓ స్పెషల్ సాంగ్ కోసం తీసుకున్నారట. సదరు ఐటెం సాంగ్ లో నాగార్జున, పూజా హెగ్డే కలిసి స్టెప్స్ వేస్తారట. ఈ మేరకు ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. అదే నిజమైతే.. ఆయన ఇద్దరు కొడుకులతో స్క్రీన్ షేర్ చేసుకున్న పూజా హెగ్డే, నాగార్జునతో కూడా రొమాన్స్ చేసినట్లు అవుతుంది.

కెరీర్ బిగినింగ్ లో పూజా హెగ్డే ఒక లైలా కోసం టైటిల్ తో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేసింది. నాగ చైతన్య హీరోగా నటించిన ఈ మూవీ ఓ మోస్తరు టాక్ తెచ్చుకుంది. పర్లేదు అనిపించుకుంది. కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ చేసింది. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అఖిల్ కెరీర్లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మూవీగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఉంది.

 

Also Read:   ‘అర్జున్ రెడ్డి’ తర్వాత నేను ఎంతో నరకం అనుభవించాను అంటూ హీరోయిన్ షాలిని పాండే షాకింగ్ కామెంట్స్!

Exit mobile version