కరోనా సమయంలో థియేటర్లు మూతపడగా ఆలోటును ఓటీటీలు కొంతమేరకు పూడ్చాయి. త్వరలోనే థియేటర్లు ఓపెన్ అవుతుండటంతో ఓటీటీ సంస్థలు నిర్మాతలకు కొత్త రూల్స్ పెడుతుండటం ఇండస్ట్రీలో ఆసక్తిని రేపుతోంది.ఓటీటీ సంస్థలు పెట్టే కొత్త రూల్స్ ఎవరికీ లాభదాయకంగా మారుతుందనే చర్చ జోరుగా సాగుతోంది.
Also Read: ‘ఆండ్రాయిడ్ కట్టప్ప’ను మిస్ కావొద్దు !
కరోనాతో థియేటర్లు మూతపడటంతో ఓటీటీలకు బాగానే కలిసొచ్చింది. అయితే ఓటీటీలో రిలీజైన కొత్త సినిమాలన్నీ కూడా ప్లాపు టాక్ తెచ్చుకున్నాయి. ఒకటి అర మినహా దాదాపు అన్ని చిత్రాలు ప్లాపు టాక్ తెచ్చుకోవడంతో ఓటీటీలు కొంతమేర నష్టపోవాల్సి వచ్చిందనే టాక్ విన్పిస్తోంది.
ఈనేపథ్యంలోనే ఓటీటీలు సినిమా విషయంలో కొత్త స్ట్రాటజీని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల కొత్త సినిమాలు కొనుగోలు చేసి ఓటీటీలు నష్టపోవడంతో ఇలాంటివి ఇకపై జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఓటీటీ సంస్థలు నిర్మాతల ముందు కొత్త రూల్స్ పెడుతున్నాయి.
ఇదివరకులా ఒకేసారి పేమెంట్ ఇచ్చి పద్ధతికి ఓటీటీలు స్వస్తి పలుకబోతున్నాయి. 50-50 పద్ధతిన సినిమాకు ముందు సగం పేమెంట్.. స్ట్రీమింగ్ అయ్యాక కొద్దిరోజులకు మిగతా సగం సొమ్ము చెల్లించబోతున్నాయి. ఇకపై శాటిలైట్ ఛానళ్ల మాదిరిగా సినిమా చూసి నమ్మకం కుదిరితే డీల్ సెట్ చేసుకోబోతున్నాయి. తమ సినిమాను నిర్మాత ఇంతమంది ప్రేక్షకులు చూస్తారనే కమిట్మెంట్ ఇవ్వాలని.. అంతకు తక్కువగా ప్రేక్షకులు చూస్తే కొంత సొమ్మ వెనక్కి ఇవ్వాలనే షరతు కూడా పెట్టనున్నాయట.
Also Read: పూజాకి ‘రాధే శ్యామ్’ స్వీట్ సర్ ప్రైజ్ !
వీటితోపాటు వ్యూస్ ప్రతిపాదికన కూడా రేట్ ఫిక్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా బాగుంటే నిర్మాతకు.. ఓటీటీ సంస్థలకు ఇద్దరికీ ఇది లాభాల పంట పండించనుంది. అయితే థియేటర్లు ఓపెన్ అవుతున్నవేళ ఓటీటీ సంస్థలు పెట్టే షరతులకు నిర్మాతలు ఏమేరకు అంగీకరిస్తారనేది మాత్రం వేచిచూడాల్సిందే..!