ఎలాంటి బోల్డ్ హీరోయిన్ అయినా మరీ పచ్చిగా మాట్లాడదు ఒక్క ‘కంగనా రనౌత్’ తప్ప. ఎంత హాట్ బాంబ్ అయినా ఏదొక సందర్భంలో కాస్త అయినా సిగ్గును ప్రదర్శిస్తోంది ఒక్క ‘కంగనా రనౌత్’ తప్ప. అసలు తనకంటూ తిక్క ఉన్న హీరోయిన్ ఎవ్వరూ ఉండరు ఒక్క ‘కంగనా రనౌత్’ తప్ప. ఆ మాటకొస్తే ఈ జనరేషన్ లో ఐటమ్ క్యారెక్టర్స్ తో హాట్ సమాజాన్ని ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ సీఎం అవ్వాలని కలలు కనదు ఒక్క ‘కంగనా రనౌత్’ తప్ప.
ఏమైనా కంగనా ప్రత్యేకం. ఆమె ఆలోచనా విధానమే కాదు, ఆమె మాటల ప్రవాహం కూడా విభిన్నమే. అదేంటో తెలియదు గానీ జయలలిత బయోపిక్ లో నటించనప్పటి నుండి కంగనాలో చాల మార్పులు వచ్చాయి. మరి జయలలిత ఆత్మ రూపంలో కంగనా ఒంటిలోకి దూరి స్ఫూర్తిని ఇచ్చిందో ఏమో కానీ, కంగనా అచ్చంగా రాజకీయ నేతలా మారిపోయింది. దీనికితోడు ఆ మధ్య ఝాన్సీ లక్ష్మీబాయి బయోపిక్ లో కూడా నటించిందయ్యే.
అప్పటినుండి తాను ఝాన్సీ లక్ష్మినే అన్నట్టుగా ఆ మధ్య చెప్పుకుని తిరిగింది. మళ్ళీ తను జయలలిత బయోపిక్ లో నటించిన తరువాత ఇక తానే జయలలితలా మారిపోయింది. అందుకే రాజకీయ నేతగా శివసేన పార్టీ పై విమర్శలు చేస్తోంది. సాధారణంగా ప్రభుత్వాలను వ్యతిరేకించేది ప్రతిపక్ష పార్టీ వాళ్లు, కానీ విచిత్రంగా శివసేన ప్రభుత్వం కంగనా చేతిలో తిట్లు తినాల్సి వస్తోంది. మొత్తానికి ప్రతిపక్షాల వాళ్లు మీడియా ముందు చేసే హడావుడి కంటే..
కంగనా చేసే రాజకీయ హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది మహారాష్ట్రలో. ఈ మధ్య కంగనా ఎక్కువుగా జనం ఉన్న ప్లేస్ లకు వెళ్తుంది అని.. అక్కడ అందర్నీ చూసి కార్లోంచి కావాలని దిగడం, పైగా దిగేటప్పుడు అచ్చం పొలిటీషియన్ లా పోజులివ్వడం వంటివి ఆమెలో కొత్తగా వచ్చిన మార్పులు అని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ హాట్ తిక్క హీరోయిన్ కి రాజకీయాలు బాగా వంటబట్టినట్టుగా ఉన్నాయి.