https://oktelugu.com/

కేసీఆర్ కు కరోనా తగ్గలేదా?

అదే గందరగోళం.. అదే ఆందోళన.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా పూర్తిగా తగ్గలేదా? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది. 65 ఏళ్లు పైబడిన కేసీఆర్ కు కరోనా కాసింత డేంజర్ గానే ప్రభావం చూపుతుంది. అయితే తెలంగాణ సీఎం కావడం.. అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉండడంతో ఆయనకు మంచి వైద్య అందుతోంది. అయినా కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులో నెగిటివ్ వచ్చి తాజాగా ఆర్టీపీసీఆర్ టెస్టులో మాత్రం మిశ్రమ ఫలితాలు రావడం ఆందోళన కలిగిస్తోంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : April 30, 2021 / 09:05 AM IST
    Follow us on

    అదే గందరగోళం.. అదే ఆందోళన.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా పూర్తిగా తగ్గలేదా? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది. 65 ఏళ్లు పైబడిన కేసీఆర్ కు కరోనా కాసింత డేంజర్ గానే ప్రభావం చూపుతుంది. అయితే తెలంగాణ సీఎం కావడం.. అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉండడంతో ఆయనకు మంచి వైద్య అందుతోంది. అయినా కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులో నెగిటివ్ వచ్చి తాజాగా ఆర్టీపీసీఆర్ టెస్టులో మాత్రం మిశ్రమ ఫలితాలు రావడం ఆందోళన కలిగిస్తోంది.

    అయితే అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సీఎం కేసీఆర్ కు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్ గా వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎంవీరావు ఈ విషయాన్ని నేరుగా చెప్పకపోవడం విశేషం. కేసీఆర్ కు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఖచ్చితమైన ఫలితా రాలేదని ఆయన ప్రకటించారు.

    దీన్ని బట్టి కేసీఆర్ కు పాజిటివ్ వచ్చిందని.. అయితే దాన్ని దాస్తున్నారని తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో మరోసారి కేసీఆర్ కు ఆర్టీపీసీఆర్ టెస్టు నిర్వహించిన తర్వాత కరోనా నెగెటివ్ అని ప్రకటిస్తారని తెలుస్తోంది.

    కేసీఆర్ కు కరోనా సోకిన 10 రోజుల తర్వాత నిన్న ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. అయితే ఖచ్చితమైన రిపోర్టు రావాలంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయాలి. దీంతో శాంపిల్ తీసుకొని చేశారు. కానీ అందులో పాజిటివ్ ఫలితం వచ్చినట్టుంది. అయితే ఖచ్చితమైన ఫలితం రాలేదని డాక్టర్ ఎంవీ రావు తెలిపారు.

    అయితే కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కేసీఆర్ డాక్టర్ తెలిపారు.వైరస్ తగ్గుముఖం పడుతున్న సమయంలో ఖచ్చితమైన ఫలితం రాదని కూడా చెబుతున్నారు.

    మరో రెండు మూడు రోజుల తర్వాత మళ్లీ పరీక్షలు చేస్తే అప్పుడు ఫలితం పై క్లారిటీ రానుంది. కేసీఆర్ కు కరోనా సోకడతో తెలంగాణలో పరిపాలన పరమైన నిర్ణయాలను సీఎస్ సోమేష్ కుమార్ తీసుకుంటున్నారు. కేటీఆర్ కూడా కరోనా బారిన పడడంతో ఐసోలేషన్ లో ఉన్నాడు. దీంతో తెలంగాణలో పాలన స్తబ్దుగా మారింది.