ప్చ్.. డైరెక్షన్ చేసినా క్రెడిట్ అంతా అతనికే !

సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా నిలబడటం మాటలు కాదు. కొంతమంది దర్శక నిర్మాతల దగ్గర దర్శకుడిగా పని చేయడం నరకంలా ఉంటుంది. ఏడాది పాటు కూర్చుని దర్శకుడు కథ రాసుకుంటాడు. నిర్మాత గంట సేపు కథ విని ఏదో మిస్ అయింది అంటాడు. పోనీ, కథ బాగాలేదు అంటాడా ? అనడు. సినిమా నేను చేయను అంటాడా ? అనడు. సినిమా చేస్తున్నాం అంటూనే సంవత్సరాల పాటు దర్శకుడ్ని అఫీస్ లోనే కుర్చోపెడతాడు. జీవితం పణంగా పెట్టి, కాలాన్ని […]

Written By: admin, Updated On : June 16, 2021 7:42 pm
Follow us on

సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా నిలబడటం మాటలు కాదు. కొంతమంది దర్శక నిర్మాతల దగ్గర దర్శకుడిగా పని చేయడం నరకంలా ఉంటుంది. ఏడాది పాటు కూర్చుని దర్శకుడు కథ రాసుకుంటాడు. నిర్మాత గంట సేపు కథ విని ఏదో మిస్ అయింది అంటాడు. పోనీ, కథ బాగాలేదు అంటాడా ? అనడు. సినిమా నేను చేయను అంటాడా ? అనడు. సినిమా చేస్తున్నాం అంటూనే సంవత్సరాల పాటు దర్శకుడ్ని అఫీస్ లోనే కుర్చోపెడతాడు.

జీవితం పణంగా పెట్టి, కాలాన్ని వృధా చేస్తూ కూర్చున్న ఆ దర్శకుడికే తెలుసు, అది ఎంత నరకంగా ఉంటుందో. దీనికితోడు ఎంతో కష్టపడి రాసుకున్న కథలో కాళ్లు, చేతులు పెట్టి మరీ కెలికేసే నిర్మాతను ఏమి అనలేక, అలా అని వచ్చిన అవకాశాన్ని వదులుకోలేక సతమతమవుతూ ఉంటారు సదరు దర్శకులు. వీటిన్నిటినీ దాటుకుని వచ్చి, హిట్ సినిమా తీసిన వాడే ఇక్కడ దర్శకుడిగా నిలబడతాడు.

లేనోడు కాల ప్రవాహంలో కొట్టుకు పోవాల్సిందే. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన ఓ సినిమా విషయంలో ఆ దర్శకుడికి ఇలాగే జరిగిందట. డైరక్టర్ కొత్త వాడు కావడంతో, కథ రాసిన అతనికి డైరక్షన్ మీద విపరీతమైన ఆసక్తి ఉండటంతో భయంకరంగా బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేసేసాడట. ప్రతి షాట్ విషయంలో తనకు నచ్చినట్టు తీయడం, పైగా సీన్ మేకింగ్ విషయంలో, అలాగే చివరకు మ్యూజిక్ విషయంలో కూడా డైరెక్టర్ కి ఎలాంటి ఫ్రీడమ్ ఇవ్వలేదట.

పాపం, డైరెక్టర్ గా సినిమా ఛాన్స్ వచ్చింది, ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలని ఎన్నో కలలు కన్న, ఆ డైరెక్టర్ కు చివరకు కనీస పేరు కూడా రాలేదు. సినిమాకి నెగిటివ్ రివ్యూస్ వచ్చినా.. జనంలో మాత్రం సినిమా పై బాగానే ఆసక్తి క్రియేట్ అయింది. కానీ, ఆ క్రెడిట్ మొత్తం ఆ సినిమాకి కథ మాటలు అందించిన వ్యక్తికే వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి కూడా డైరెక్టర్ కావడమే, ఇక్కడ ప్రధాన సమస్య అయింది. మరి ఆ కొత్త డైరెక్టర్ కి మళ్లీ సినిమా వస్తోందా ? చూడాలి.