https://oktelugu.com/

Devara: దేవర చుట్టూ రాజకీయ కోణం.. వైసీపీ, బీఆర్ఎస్ ఫుల్ సపోర్ట్

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానుల్లో దేవర హీట్ కనిపిస్తోంది. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో నిర్మితమై విడుదలైన దేవర హిట్ టాక్ తెచ్చుకుంది. కేవలం ఒక్క రోజులోనే రూ.172 కలెక్టన్లు సాధించినట్లు ఇప్పటికే ప్రకటించారు.

Written By:
  • Srinivas
  • , Updated On : September 28, 2024 3:02 pm
    Devara

    Devara

    Follow us on

    Devara: శత్రువుని ఢీకొనాలంటే శత్రువు ఫ్యామిలీ నుంచే సపోర్టు ఎవరిదైనా రావాలి. ఎందుకంటే అక్కడి లొసుగులు గానీ, ఆయన బలహీనతలు గానీ ఇట్టే తెలుసుకోవచ్చు. దాంతో ఢీకొట్టడానికి మరింత సులువు అవుతుంది. ఇలా చాలా సినిమాల్లోనూ చూశాం. అయితే.. ఇప్పుడు దేవర సినిమా విషయంలోనూ అదే జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ నిన్న విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆదరిస్తోంది. థియేటర్లన్నీ ప్రేక్షకులతో నిండిపోతున్నాయి. హీరోయిన్ జాన్వీకపూర్ ఇందులో ఎన్టీఆర్‌కు జోడిగా నటించింది. మాస్ లుక్‌లో జూనియర్ ఎన్టీఆర్ రచ్చ చేస్తున్నాడు. ఆరేళ్ల తరువాత వచ్చిన దేవర అభిమానుల ఆకలి తీర్చినట్లయింది.

    ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానుల్లో దేవర హీట్ కనిపిస్తోంది. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో నిర్మితమై విడుదలైన దేవర హిట్ టాక్ తెచ్చుకుంది. కేవలం ఒక్క రోజులోనే రూ.172 కలెక్టన్లు సాధించినట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇంకా ముందు ముందు రికార్డులు సృష్టించడం ఖాయమని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా చుట్టూ రాజకీయ కోణం ముసురుకుంది. ఎన్నడూ లేని విధంగా టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్‌ అభిమానుల మధ్య వార్ నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకోవడం కనిపించింది.

    ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీల మధ్య సత్సంబంధాలు అంతంత మాత్రమే అనేది అందరికీ తెలిసిందే. గత ఎన్నికల వేళ కూడా తన తాత స్థాపించిన టీడీపీ పార్టీ తరఫున ఆయన ప్రచారంలోనూ పాల్గొనలేదు. ఆ ఎన్నికల్లో పెద్దగా కనిపించలేదు. కారణాలు ఏవైనా ఆయన మాత్రం టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. రాజకీయాలపై ఈ మధ్య ఆయన నుంచి ఎలాంటి స్టేట్‌మెంట్లు కూడా కనిపించలేదు. రాజకీయాల గురించి ఎక్కడా కూడా మాట్లాడలేదు.

    ఈ క్రమంలో నిన్న రిలీజ్ అయిన దేవరను మాత్రం రాజకీయాలు చుట్టుముట్టడం ఆసక్తి కలిగిస్తోంది. ఎన్టీఆర్ వెండితెర మీద మంచి నటుడు అని.. నిజజీవితంలో కూడా నడిస్తున్నాడని టీడీపీ నేతలు కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ వాళ్లకు దగ్గరగానే ఉన్నావు, బీఆర్ఎస్ వాళ్లకు దగ్గరగా ఉన్నావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. వాళ్లు ఏ రోజు కూడా సపోర్టు చేయరని పేర్కొన్నారు. టీడీపీ నేతలకు కౌంటర్‌గా మరికొన్ని కౌంటర్లు వచ్చిపడ్డాయి. ఎన్టీఆర్‌కు తెలుగుదేశం పార్టీ వారే సరిగా సపోర్టు చేయలేదని వైసీపీ కౌంటర్ ఇచ్చింది. బీఆర్ఎస్ నుంచి కూడా ఫుల్ సపోర్టు వచ్చిందని కొందరు కామెంట్లు పెట్టడం కనిపించింది.

    వరుస హిట్టులతో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్‌ సినిమా విషయంలో ఫ్యాన్స్ మధ్య ఇలాంటి కామెంట్లు నడుస్తుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఎన్టీఆర్ ఈ చర్చపైన ఎలా స్పందిస్తారో అని చర్చ నడుస్తోంది. స్పందిస్తారా.. లేదంటే లైట్ తీసుకుంటారా.. అనే టాక్ సైతం నడుస్తోంది. ఈ రచ్చ ముందు ముందు ఎటు వైపు దారితీస్తుందా.. ఎంతటి రచ్చ రేపుతుందా అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.