https://oktelugu.com/

Jani Master: జానీ మాస్టర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు..ఆత్మహత్యాయత్నం చేసిన భార్య ఆయేషా!

2019 వ సంవత్సరం లో శ్రేష్టి వర్మ ఈటీవీ లో ప్రసారమయ్యే పాపులర్ డ్యాన్స్ షో 'ఢీ' ద్వారా ఒక సాధారణ కంటెస్టెంట్ గా ఆయనకు పరిచయం అయ్యింది. ఈ షో కి అప్పుడప్పుడు జానీ మాస్టర్ న్యాయ నిర్ణేతగా వస్తుంటాడు. అలా పరిచయమైనా శ్రేష్టి వర్మ ని, ఆమెలోని అద్భుతమైన టాలెంట్ ని గుర్తించి తన అసిస్టెంట్ గా పెట్టుకున్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : September 28, 2024 / 02:55 PM IST

    Jani Master(4)

    Follow us on

    Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు లో అరెస్ట్ అయ్యి పోలీసుల రిమాండ్ లో ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పోలీసులు ఆయనను కోర్టు అనుమతి తో కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విచారణలో జానీ మాస్టర్ పోలీసులకు తన తప్పు ఏమి లేదని, ఆ అమ్మాయి ఇలా చేసినందుకు చాలా బాధగా ఉందని, ఆమెని నేను మైనర్ గా ఉన్నప్పుడు లైంగిక వేధింపులు చేశాను అంటూ చేసిన ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని, ఇండస్ట్రీ లో ఒక పెద్ద మనిషి ఆమె చేత ఇలాంటి కుట్రలు చేయిస్తూ నా కెరీర్ ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యం లో జానీ మాస్టర్ భార్య ఆయేషా కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

    ఆమె మాట్లాడుతూ ‘ నా భర్త ని శ్రేష్టి వర్మ అనేక విధాలుగా వేధించింది. ప్రేమ, పెళ్లి పేరుతో అతనిని మానసిక వేదనకు గురి అయ్యేలా చేసింది. నేను కూడా ఆమె కారణంగా ఒకసారి ఆత్మహత్యాయత్నం చేశాను. ఆమె తల్లి కూడా తక్కువేం కాదు, ఆమె కూడా మమ్మల్ని ఎంతో మనోవేదనకు గురి చేసింది. ఇప్పట్టికీ కూడా ఆమె మమల్ని ఇలా కోర్టు, కేసులు చుట్టూ తిప్పుతూ మా పరువు తీస్తుంది. నాకు, నా పిల్లలకు ఈ సమయంలో ఏదైనా జరిగితే ఆ అమ్మాయిదే బాధ్యత’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారాయి. ఇదే విషయాన్నీ ఫిలిం ఛాంబర్ దృష్టికి కూడా తీసుకెళ్లి మాకు న్యాయం చేయండి అని కోరుకున్నట్టుగా ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. అయితే అయేషా చేసిన ఆరోపణలకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. శ్రేష్టి వర్మ తనని జానీ మాస్టర్ వేధించినట్టుగా పలు ఆధారాలు పోలీసులకు అందించిందట. ఆ ఆధారాలను పరిగణలోకి తీసుకొని జానీ మాస్టర్ ని పోలీసులు పలు ప్రశ్నలు అడిగారని, దానికి ఆయన సమాధానం కూడా చెప్పాడని తెలుస్తుంది.వాటి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    2019 వ సంవత్సరం లో శ్రేష్టి వర్మ ఈటీవీ లో ప్రసారమయ్యే పాపులర్ డ్యాన్స్ షో ‘ఢీ’ ద్వారా ఒక సాధారణ కంటెస్టెంట్ గా ఆయనకు పరిచయం అయ్యింది. ఈ షో కి అప్పుడప్పుడు జానీ మాస్టర్ న్యాయ నిర్ణేతగా వస్తుంటాడు. అలా పరిచయమైనా శ్రేష్టి వర్మ ని, ఆమెలోని అద్భుతమైన టాలెంట్ ని గుర్తించి తన అసిస్టెంట్ గా పెట్టుకున్నాడు. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పని చేసిన ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కి శ్రేష్టి వర్మ అసిస్టెంట్ గా పని చేసింది. కేవలం ఇక్కడే కాదు, బాలీవుడ్ లో కూడా జానీ మాస్టర్ సాంగ్స్ కి అసిస్టెంట్ గా చేసింది. ఏడాదిన్నర క్రితం జానీ మాస్టర్ టీం నుండి బయటకి వచ్చి, కొరియోగ్రాఫర్ గా ఎదిగింది. ఇప్పుడిప్పుడే ఆమెకు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. తనని వదిలి వెళ్లినందుకు జానీ మాస్టర్ తనని ఇలా చేస్తున్నాడని ఆమె FIR లో ఆరోపించింది.