Pokiri Re Release: ప్రతీ ఏడాది లాగానే ఈ ఏడాది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా నిర్వహించడానికి సిద్ధమయ్యారు మహేష్ ఫ్యాన్స్. ఒకవిధంగా ఈ రీ రిలీజ్ ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది మహేష్ ఫ్యాన్స్ అనుకోవచ్చు. 2021 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘గబ్బర్ సింగ్’ స్పెషల్ షోస్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20 చోట్ల ప్లాన్ చేశారు పవన్ ఫ్యాన్స్. ఈ ఐడియా ఎదో బాగుందే అని , మహేష్ ఫ్యాన్స్ కొద్దిరోజులకే దూకుడు స్పెషల్ షోస్ ని ఏర్పాటు చేశారు. ఇక ఆ తర్వాత మహేష్ పుట్టిన రోజు సందర్భంగా 2022 వ సంవత్సరం లో ‘పోకిరి’ మూవీ కి సంబంధించిన స్పెషల్ షోస్ ని ప్రపంచవ్యాప్తంగా వందల సంఖ్యలో ప్లాన్ చేశారు. పెద్ద హిట్ అయ్యింది, దీంతో అక్కడి నుండి ఈ ట్రెండ్ తారాస్థాయికి చేరుకుంది.
అదే ఏడాది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్లాన్ చేసిన ‘జల్సా’ రీ రిలీజ్ కూడా బంపర్ హిట్ అయ్యింది. దీంతో రీ రిలీజ్ ట్రెండ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో మొదలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ ఈసారి పోకిరి చిత్రాన్ని చాలా గ్రాండ్ గా విడుదల చెయ్యాలని ప్లాన్ చేశారు. ఇప్పటి వరకు మిడ్ నైట్ షోస్ ఒక రీ రిలీజ్ సినిమాకు పడలేదు. కానీ మహేష్ ఫ్యాన్స్ ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా ఆగష్టు 9 న మిడ్ నైట్ షోస్ ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా ఒక సరికొత్త ట్రెండ్ అనే చెప్పొచ్చు. ఇది క్లిక్ అయితే సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ‘పంజా’ రీ రిలీజ్ కి మిడ్ నైట్ షోస్ ప్లాన్ చేయొచ్చు.
కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మిడ్ నైట్ షోస్ ప్రదర్శించడం నిషేధం అనే సంగతి అందరికీ తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ లో అయినా 50 శాతం అవకాశాలు ఉన్నాయి కానీ , తెలంగాణ లో మాత్రం మిడ్ షోస్ కి అనుమతి రావడం అసాధ్యం. ఒకవేళ మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డి ని సంప్రదిస్తే ఏమైనా పని జరగొచ్చేమో చూడాలి. ఇకపోతే మహేష్ పుట్టిన రోజున ‘వారణాసి’ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్, లేదా టీజర్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. మరో వారం రోజుల్లో దీనిపై అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
