Homeఆంధ్రప్రదేశ్‌AP IT Pharma Jobs: దేశానికే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి విశాఖపట్నం, విజయవాడ ఎదగబోతున్నాయా?

AP IT Pharma Jobs: దేశానికే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి విశాఖపట్నం, విజయవాడ ఎదగబోతున్నాయా?

AP IT Pharma Jobs: తినేవాడికి అర్హత ఉండాలి. పెట్టేవాడికి స్తోమత ఉండాలి. తినే అర్హత ఉన్నప్పటికీ పెట్టే స్తోమత లేకపోవడంతో ఇప్పటివరకు ఏపీ యువత కొలువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు. ఐటీ ఉద్యోగాల కోసం హైదరాబాదు, బెంగళూరు, పూణే, ఢిల్లీ, గురు గ్రామ్, నోయిడా వంటి ప్రాంతాలలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇక ఫార్మా రంగ చదువులు చదివిన వారు ఉద్యోగాల వల్ల అక్కడే స్థిర నివాసులుగా మారిపోయారు. ఉన్న ప్రాంతాలలో ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలూ లేవు. ప్రభుత్వాలు పంచుడు పథకాలకు మాత్రమే ప్రయారిటీ ఇవ్వడంతో.. ఉద్యోగం కాదు కదా కనీసం ఉపాధి దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ఇది నిన్నటి వరకు పరిస్థితి..

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారిగా పరిస్థితి మారుతోంది. మామూలుగా కాదు, ఉద్యోగాల కోసం వలస వెళ్లే స్థాయి నుంచి.. దేశానికే ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఆంధ్రప్రదేశ్ ఎదుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ నగరాలుగా పేరుపొందిన విశాఖపట్నం, విజయవాడ పారిశ్రామిక, ఉద్యోగ కల్పన కేంద్రాలుగా ఎదుగుతున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ ఐటీ సంస్థ Linked in వెల్లడించింది.. ఈ నగరాల్లో ఉన్న అవకాశాలను అత్యంత ప్రముఖంగా విశ్లేషించింది.

Also Read: AP Rain updates: ఏపీలో ఏంటీ వాతావరణం.. ఆ జిల్లాలకు అలెర్ట్!

Linked in జాబితాలో విశాఖపట్నం మొదటి స్థానంలో నిలిచింది.. విశాఖపట్నం ఐటి, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, ఎడ్యుకేషన్, మెటల్ మినరల్స్, లాజిస్టిక్స్ విభాగాలలో ఊహించని స్థాయిలో పురోగతి సాధిస్తోంది.. తక్కువ జీవన ఖర్చులు.. మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ లక్ష్యం ఇవన్నీ కూడా విశాఖ ప్రాంతాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాయి..నగరంలో ఇప్పటికే పలు స్టార్టప్ కంపెనీలు పనిచేస్తున్నాయి. టెక్ హబ్ లు కూడా ఏర్పాటు అవుతున్నాయి. ప్రభుత్వ చొరవతో హిల్ టాప్ ఐటి టవర్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు విశాఖను ఐటి రాజధానిగా మార్చుతున్నాయి.

LinkedIn జాబితాలో విజయవాడ మూడో స్థానంలో నిలిచింది. విజయవాడ నగరం యువతకు అనేక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.. విజయవాడ నగరంలో బెంజ్ సర్కిల్ నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు ఏర్పాటైన సంస్థలు సరికొత్త అవకాశాలు కల్పిస్తున్నాయి. అనతి కాలంలోనే ఈ నగరం ఉద్యోగులకు వరం లాగా మారింది. ఈ సానుకూలతలు ఏకంగా విశాఖ నగరానికి సమీపంలోకి తీసుకొచ్చాయి.. విజయవాడ నగరంలో కేఎల్, ఎస్ ఆర్ ఎం, ఎన్ఐడి వంటి ఉత్తమ విద్య సంస్థలు ఉన్నాయి. ఇక్కడ చదువుకున్న యువతకు అవకాశాలు కల్పించడానికి అనేక సంస్థలు సిద్ధంగా ఉన్నాయి.

Also Read: AP Microsoft Quantum Valley: అమరావతికి దిగ్గజ టెక్నాలజీ సంస్థ!

ఇక్కడ రిటైల్, ఎస్టేట్, టెలికాం, స్థిరాస్తి రంగాలలో ఊహించని స్థాయిలో అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఇక్కడి యువతకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఏడాది క్రితం ఏర్పడిన కొత్త ప్రభుత్వం విధానాలను ప్రజలకు అనుకూలంగా రూపొందిస్తున్నది. రవాణా వ్యవస్థ కూడా గణనీయంగా మెరుగుపడింది. ప్రొఫెషనల్ నెట్వర్క్ సంస్థలు విజయవాడ ను తమ గమ్యస్థానంగా ఎంచుకోవడం వల్ల ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగాల పెరుగుదల, టాలెంట్, కొత్త కంపెనీల ఏర్పాటు, ఉద్యోగుల నైపుణ్యాలు వంటివి ఈ ప్రాంతాన్ని సరికొత్తగా మార్చేలా చేసిందని LinkedIn తన నివేదికలో స్పష్టం చేసిందంటే.. విజయవాడ ఏ స్థాయిలో మారిందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఇప్పటివరకు ఉద్యోగాల కోసం ఏపీ యువత బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల వైపు వెళ్ళింది. ఏపీకి చుట్టపు చూపుగా వచ్చింది. అయితే ఇకపై ఇది గతం కానుంది. ఎందుకంటే విశాఖపట్నం ఉద్యోగాలు కల్పించే నగరాలలో మొదటి స్థానంలో ఉండడం.. విజయవాడ మూడో స్థానంలో ఉండడం భవిష్యత్తు పై సరికొత్త ఆశలను కల్పిస్తోంది.. ఇక విశాఖ, విజయవాడ తర్వాత అనేక నగరాలు ఈ జాబితాలో ఉన్నప్పటికీ.. వాటితో పోల్చుకుంటే ఈ నగరాలలో రవాణా సౌకర్యాలు.. మౌలిక సదుపాయాలు గొప్పగా ఉన్నాయి. పైగా ఈ నగరాలకు పర్యాటకంగా విశేషమైన గుర్తింపు ఉంది. పర్యాటకంలో లెక్కకు మిక్కిలి ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. విజయవాడ, విశాఖపట్నం చుట్టూ గత ఏడాదిగా తిరుగులేని స్థాయిలో అభివృద్ధి రేటు కనిపిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే ఉద్యోగాల కోసం వలస వెళ్లడం కాదు.. దేశానికే ఉద్యోగాలు కల్పించే స్థాయికి విజయవాడ, విశాఖపట్నం ఎదుగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular