Homeఎంటర్టైన్మెంట్Pochamma Web Series Review: 'పోచమ్మ' వెబ్ సిరీస్ రివ్యూ : ఆహా యాప్ లో...

Pochamma Web Series Review: ‘పోచమ్మ’ వెబ్ సిరీస్ రివ్యూ : ఆహా యాప్ లో ది బెస్ట్ థ్రిల్లర్ మూవీ అంటే ఇదే..

Pochamma Web Series Review: ఆహా మీడియా లో ఈమధ్య కాలం లో విడుదల అవుతున్న కొన్ని ఒరిజినల్ కంటెంట్స్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రీసెంట్ గా విడుదలైన ‘పోచమ్మ'(Pochamma) అనే వెబ్ సిరీస్ ని ప్రేక్షకులు అమితంగా ఇష్టపడుతున్నారు. మిస్టిక్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 17 న అందుబాటులోకి వచ్చింది. సీరియల్ నటుడు, బిగ్ బాస్ 7 ఫేమ్ అర్జున్ అంబటి , పూజ రెడ్డి , రమేష్ ఇందిరా , కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ తదితరులు ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలు పోషించారు. రమేష్ ఇంద్ర ఈ వెబ్ సిరీస్ దర్శకత్వం వహించాడు. మరి ఈ సిరీస్ ఎలా ఉంది అనేది ఈ రివ్యూ లో క్లుప్తంగా తెలుసుకుందాం.

కథ :

ప్రముఖ వ్యాపారవేత్త ఫెడ్రిక్ ఒక ఆహ్లాదకరమైన అటవీ ప్రాంతం లో విలాసవంతమైన ఎస్టేట్ ని కొనుగోలు చేసి తన భార్య , ఇద్దరు కూతుర్లు, అల్లుడుతో కలిసి ఉండేందుకు వస్తాడు. ఆ ఎస్టేట్ కి మ్యానేజర్ గా రఘుపతి అనే వ్యక్తి పని చేస్తుంటాడు. అతని కుటుంబం కూడా ఆ ఎస్టేట్ లో పనివాళ్ళు గా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఈ ఎస్టేట్ లో మహిమగల పోచమ్మ తల్లి విగ్రహం ఉంటుంది. క్రిస్టియన్ అయినటువంటి ఫెడ్రిక్ ఆ పోచమ్మ తల్లి విగ్రహాన్ని అక్కడి నుండి తొలగించి , బయట పడేస్తాడు. అప్పటి నుండి ఆ ఎస్టేట్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముందుగా ఫెడ్రిక్ చిన్న కూతురు ఆత్మహత్య చేసుకొని చనిపోగా అల్లుడు కూడా ఒక భారీ ప్రమాదం లో మరణిస్తాడు. కానీ పెద్ద కూతురు మాత్రం ఆ ప్రమాదం నుండి బయటపడుతుంది. ఇలా వరుసగా దారుణాలు జరగడం తో ఫెడ్రిక్ సతీమణి ఇక్కడి నుండి వెళ్ళిపోదామని సలహా ఇస్తుంది. అప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి ? అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

విశ్లేషణ :

ఆరంభం లోనే ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో సాగిస్తాడు డైరెక్టర్ రమేష్. జెస్సీ మరణం , దాని చుట్టూ పోలీస్ ఇన్వెస్టిగేషన్ తో మొదలు అవుతుంది ఈ చిత్రం. పోలీస్ దర్యాప్తు సన్నివేశాలను చాలా గ్రిప్పింగ్ గా ఉండేలా చూసుకున్నాడు డైరెక్టర్. అక్కడక్కడా కొద్దిగా ల్యాగ్ అన్పిస్తుంది కానీ , ఆయన రాసుకున్న కొన్ని ట్విస్టులను చూస్తే మైండ్ బ్లాక్ అవ్వక తప్పదు. అయితే ఈ వెబ్ సిరీస్ లో ఉన్న ఏకైక మైనస్ ఏమిటంటే తెలుగు నటీనటులు తక్కువ ఉండడం , ఎక్కువ శాతం మంది నటులు కన్నడ వాళ్ళే ఉండడం. ఈ కారణం చేత తెలుగు సిరీస్ చూస్తున్నాం అనే ఫీలింగ్ రాదు కానీ , ఓవరాల్ వెబ్ సురేష్ మాత్రం మంచి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో కూర్చొని ఈ సిరీస్ ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular