Star Heroine Remuneration: అయితే ఒకప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్లతో కలిసి నటించిన ఒక స్టార్ హీరోయిన్ తొలి పారితోషకం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ హీరోయిన్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి దిగ్గజ హీరోలతో నటించి బాగా గుర్తింపు తెచ్చుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా తన చక్రం తిప్పింది. సినిమాలలో చాలా విజయం సాధించిన ఈ హీరోయిన్ రాజకీయాలలో కూడా ఎంట్రీ ఇచ్చి తనదైన ముద్ర వేసుకుంది. ఇప్పటివరకు ఈ స్టార్ హీరోయిన్ ఎనిమిది భాషలలో దాదాపు 300కు పైగా సినిమాలలో నటించే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కానీ ప్రస్తుతం ఈ హీరోయిన్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఈ హీరోయిన్ మరెవరో కాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయప్రద. జయప్రద టాలీవుడ్ సినిమా ఫైనాన్షియల్ కూతురు. చిన్నతనంలో జయప్రద డాక్టర్ కావాలని అనుకుంది.
Also Read: దుబాయ్‌లో భారత బిలియనీర్‌కు జైలు శిక్ష.. కారణం ఇదే
ఆమె స్కూల్ చదువుతున్న రోజులలో స్కూల్ వార్షికోత్సవంలో జయప్రద డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసిన దర్శకుడు తెలుగులో భూమి సినిమా కోసం జయప్రదను మూడు నిమిషాల డాన్స్ రోల్ ఇచ్చారు. ఈ సినిమాతో జయప్రద తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. జయప్రద తొలి సినిమాకు పారితోషకంగా కేవలం పది రూపాయలు అందుకుంది. భూమి సినిమాలో కేవలం మూడు నిమిషాల పాత్ర జయప్రద జీవితాన్ని మలుపు తిప్పింది అని చెప్పడంలో సందేహం లేదు. 1976 సమయంలో జయప్రద తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా మారింది. అలాగే హీరోయిన్ జయప్రద తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన సిరిసిరిమువ్వ అనే సినిమాకు రీమేక్ గా సర్గం అనే సినిమాతో 1979 లో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాకు గాను జయప్రద ఉత్తమ నటిగా ఫిలింఫేర్ నామినేషన్ లో కూడా నిలిచింది.
తెలుగుతోపాటు ఎన్నో హిందీ సినిమాలలో కూడా జయప్రద స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. జయప్రద 1985 సమయంలో సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక అదే సమయంలో ఐటీ శాఖ దాడులు కూడా నిర్వహించడం జరిగింది. ఆ సమయంలో హీరోయిన్ జయప్రదకు నిర్మాత మరియు ఆమె స్నేహితుడు శ్రీకాంత్ చాలా అండగా నిలిచారు. ఆ సమయంలో జయప్రద కు మరియు శ్రీకాంత్ నహత కు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ అప్పటికే శ్రీకాంత్ పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఇక జయప్రద, శ్రీకాంత్ నహత పెళ్లి 1986లో జరిగింది. కానీ ఆ తర్వాత కొన్ని మనస్పర్ధల కారణంగా వీరిద్దరూ విడిపోయారు.
View this post on Instagram