Photo Story : ఒకప్పుడు ఈమె అద్భుతమైన డాన్స్ స్టెప్పులకు యూత్ మొత్తం అట్రాక్ట్ అయిపోయేది. ఈమె సుమారు 900 కు పైగా సినిమాలలో నటించి బాగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ రియల్ లైఫ్ లో మాత్రం ఈ నటి చాలా ఒడిదుడుకులను ఎదురుకొంది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు బాగా క్రేజ్ ఉన్న నటీమణులలో ఈమె కూడా ఒకరు. ఒకప్పుడు ఈమె యూత్ కలల రాణి అని కూడా చెప్పడంలో సందేహం లేదు. అనేక తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం మరియు తెలుగు చిత్రాలలో నటించి బాగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజె క్రియేట్ చేసుకుంది ఈ బ్యూటీ. రియల్ లైఫ్ లో మాత్రం ఎన్నో కష్టాలను చూసింది. ఈ నటి మరెవరో కాదు డిస్కో శాంతి. డిస్కో శాంతి 1985లో రిలీజ్ అయిన ఉదయ గీతం అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత డిస్కో శాంతి ఉమై వెలిగల్, రాజా సాది,రసవ్ ఉన్నై నంబి, ధర్మతిన్ తలైవాన్ వంటి పలు సినిమాలలో నటించి బాగా ఫేమస్ అయింది.
Also Read : సీనియర్ నటి హేమ కూతురు ఎలా ఉందో చూశారా…స్టన్నింగ్ ఫోటోలు వైరల్
ఒకప్పుడు అన్ని భాషలలో స్పెషల్ సాంగ్స్ కు ఈమె కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. ప్రస్తుతం డిస్కో శాంతి వయసు 60 సంవత్సరాలు. కెరియర్ లో బాగా బిజీగా ఉన్న సమయంలోనే డిస్కో శాంతి టాలీవుడ్ నటుడు శ్రీహరిని ప్రేమించి వివాహం చేసుకుంది. డిస్కో శాంతి, శ్రీహరి వివాహం 1991లో జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు మరియు ఒక కూతురు ఉన్నారు. కూతురు పుట్టిన నాలుగు నెలలకే కన్నుమూయడంతో ఈ దంపతులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తమ కూతురి పేరు మీద అక్షర ఫౌండేషన్ను కూడా స్థాపించి పలు గ్రామాలకు పరిశుభ్రమైన నీటితో పాటు పాఠశాల సౌకర్యాలను కూడా కల్పించారు.
ఇక నటుడు శ్రీహరి కూడా
గుండెపోటుతో 2013లో మరణించారు. భర్త మరణించిన తర్వాత డిస్కో శాంతి తీవ్రవాతుడికి గురైంది. ఆ సమయంలో మానసిక ఒత్తిడితో తాను మద్యానికి కూడా బానిస అయినట్లు డిస్కో శాంతి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తన భర్త మరణం నుంచి తాను కోలుకోవడానికి దాదాపు ఏడేళ్లు తాను మద్యానికి బానిస అయినట్లు డిస్కో శాంతి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తాను మేల్కొని ఉన్న సమయంలో తన జీవితంలో జరిగిన విషాదం గుర్తుకు వచ్చేదని ఆ సమయంలో భోజనం కూడా చేయకుండా మధ్యానికి బానిస అయినట్లు ఆమె తెలిపారు. అప్పుడే తను 45 కిలోల బరువు తగ్గినట్లు కూడా చెప్పుకొచ్చారు. అప్పుడు డాక్టరు హెచ్చరించడంతోపాటు తన పిల్లలు కూడా తనను వారించడంతో గత నాలుగేళ్ల నుంచి మద్యానికి దూరంగా ఉంటున్నట్లు డిస్కో శాంతి తెలిపారు.
