Homeఎంటర్టైన్మెంట్Bullet Bhaskar: జబర్దస్త్ షో తెరవెనుక సీక్రెట్స్ బయటపెట్టిన బుల్లెట్ భాస్కర్, కీలక కామెంట్స్

Bullet Bhaskar: జబర్దస్త్ షో తెరవెనుక సీక్రెట్స్ బయటపెట్టిన బుల్లెట్ భాస్కర్, కీలక కామెంట్స్

Bullet Bhaskar: జబర్దస్త్ షో అంటే తెలియని హాస్యప్రియులు ఉండరు. దశాబ్దానికి ఈ కామెడీ షో ప్రేక్షకులను అలరిస్తుంది. 2013లో ప్రయోగాత్మకంగా జబర్దస్త్ షో మొదలైంది. రోజా, నాగబాబు జడ్జెస్ కాగా, అనసూయ భరద్వాజ్ యాంకర్ గా వ్యవహరించింది. జబర్దస్త్ ఊహకు మించి సక్సెస్ అయ్యింది. దాంతో ఎక్స్ట్రా జబర్దస్త్ పేరుతో మరో షో స్టార్ట్ చేశారు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ తెలుగు టెలివిజన్ పరిశ్రమను ఏలాయి. యూట్యూబ్ లో కూడా జబర్దస్త్ స్కిట్స్ కి మిలియన్స్ లో వ్యూస్ వచ్చేవి.

Also Read: ఎముకలు బలహీనంగా ఉన్నాయా? అయితే ఈ పండ్లు తీసుకోండి..

ఇక జబర్దస్త్ వేదికగా స్టార్స్ అయిన సామాన్యులు ఎందరో ఉన్నారు. అనసూయ, రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో ప్రసాద్, చమ్మక్ చంద్ర.. చెప్పుకుంటూ పొతే ఈ లిస్ట్ చాలా పెద్దది. జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో బుల్లెట్ భాస్కర్ ఒకడు. ఈయన మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. కృష్ణంరాజు, మహేష్ బాబు, కృష్ణతో పాటు పలువురు వాయిస్ లను చాలా దగ్గరగా ఇమిటేట్ చేస్తాడు. టీమ్ సభ్యుడిగా ఎంట్రీ ఇచ్చి లీడర్ అయ్యాడు. బుల్లెట్ భాస్కర్ తాజాగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. సదరు ఇంటర్వ్యూలో జబర్దస్త్ కి సంబంధించిన కీలక విషయాలు పంచుకున్నాడు.

జబర్దస్త్ షోలో స్కిట్ చేయడం అంత సులభం కాదని ఆయన తెలియజేశారు. మనం చేయబోయే స్కిట్ ఏమిటో ముందే మేనేజ్మెంట్ కి తెలియజేయాలి. వారి అనుమతి తీసుకోవాలి. దేవుళ్ళు, ప్రముఖులు, మతాలకు సంబంధించిన పేర్లు రాకుండా చూసుకోవాలి. గతంలో నేను చేసిన స్కిట్ వివాదాస్పదం అయ్యింది. ఫోన్లు చేసి నరకం చూపించారు. అప్పటి నుండి జాగ్రత్తగా ఉంటున్నాను. టీమ్ లీడర్ గా చేయడం మరింత కష్టం… అని బుల్లెట్ భాస్కర్ చెప్పుకొచ్చాడు.

కాగా జబర్దస్త్ కి ఒకప్పటి వైభవం లేదు. స్టార్స్ అందరూ ఆ షోకి దూరమయ్యారు. చాలా మంది సిల్వర్ స్క్రీన్ పై రాణిస్తున్నారు. కొత్త కమెడియన్స్, టీమ్ లీడర్స్ వచ్చారు. రాకెట్ రాఘవ, బుల్లెట్ భాస్కర్ వంటి కొద్ది మంది కమెడియన్స్ మాత్రమే ఉన్నారు. కామెడీ పాళ్ళు తగ్గడంతో ప్రేక్షకులు పెద్దగా ఆదరించడం లేదు. యూట్యూబ్ వ్యూస్ కూడా తగ్గాయి.

Exit mobile version