Phoenix Trailer Review: పాన్ ఇండియా లెవెల్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషిస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi). ఈయనకు తమిళనాడు లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. కేవలం హీరో పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా, అవసరమైతే విలన్ క్యారెక్టర్స్ కూడా చేస్తూ, తాను పోషించలేని పాత్ర అంటూ ఏది లేదని నిరూపించి చూపించాడు. ‘మాస్టర్’ చిత్రం వరకు విజయ్ సేతుపతి కేవలం హీరో పాత్రలే చేసాడు. మాస్టర్ నుండి విలన్ పాత్రలు, ముఖ్యమైన పాత్రలు కూడా చేయడం మొదలు పెట్టాడు. మన తెలుగు ఆడియన్స్ కి ఆయన ‘మాస్టర్’, ‘ఉప్పెన’ , ‘సైరా నరసింహా రెడ్డి’ వంటి చిత్రాల ద్వారా సుపరిచితమయ్యాడు. ఇది ఇలా ఉండగా విజయ్ సేతుపతి కి సూర్య(Surya Sethupathi) అనే కొడుకు ఉన్నాడు. ఇప్పుడు ఈయన కూడా హీరో గా వెండితెర అరంగేట్రం చేస్తున్నాడు.
ఆయన హీరో గా నటించిన ‘ఫినిక్స్'(Phoenix Movie) అనే చిత్రం వచ్చే నెల 4 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నిన్న విడుదల చేసారు మేకర్స్. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ ని మంచి రెస్పాన్స్ వచ్చింది. సూర్య సేతుపతి లుక్స్ చూసేందుకు తన తండ్రిలాగానే చాలా యావరేజ్ లుక్స్ తో ఉన్నాడు. కానీ టీనేజ్ లో విజయ్ సేతుపతి ఎలాంటి లుక్స్ లో ఉండేవాడో, అలాంటి లుక్స్ లో కనిపిస్తున్నాడు. కుర్రాడిలో ఇంటెన్సిటీ ఉంది, డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. నటన ఎలా ఉంటుందో చూడాలి. తన తండ్రి నటన కు నేటి తరం హీరోలలో కమల్ హాసన్ రేంజ్ పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ఆయన కొడుకు కాబట్టి సూర్య సేతుపతి మీద కూడా అలాంటి అంచనాలే ఉంటాయి. ఆ అంచనాలను అందుకోవడం అంత తేలికైన విషయం కాదు.
మరి సూర్య సేతుపతి ఎలా నటిస్తాడో చూడాలి. ఇకపోతే ఈ చిత్రం లో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. డైరెక్టర్ గా ANL అరసు మాస్టర్ వ్యవహరించాడు. ఈయన తమిళనాడు లో స్టంట్ మాస్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోలందరికీ ఈయన ఫైట్స్ కంపోజ్ చేసాడు. ఇదే డైరెక్టర్ గా ఆయన మొట్టమొదటి సినిమా. విజయ్ సేతుపతి ఇతని చేతిలో తన కొడుకుని లాంచ్ చేయించడం అంటే సాహసం అనే చెప్పాలి. ప్రయోగాలు చేయడం లో విజయ్ సేతుపతి మొదటి నుండి మంచి నేర్పరి. సక్సెస్ అయ్యాడు కూడా, కాబట్టి ఈ చిత్రం కూడా కచ్చితంగా సక్సెస్ సాదిస్తుందని అంటున్నారు విజయ్ సేతుపతి ఫ్యాన్స్. మరి అది ఎంత వరకు నిజం అవ్వబోతుందో చూడాలి.