Kuberaa Collection: శేఖర్ కమ్ముల(Sekhar Kammula) ‘కుబేర'(Kuberaa Movie) చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ థియేటర్స్ లో విడుదలై ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అటు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కెరీర్ లో, ఇటు ధనుష్(Dhanush) కెరీర్ లో కమర్షియల్ గా కానీ, సినిమా పరంగా కానీ ఒక మర్చిపోలేని తీపి జ్ఞాపకం గా ఈ చిత్రం మిగిలిపోయింది. విడుదలై 8 రోజులు పూర్తి కావొస్తున్నా కూడా ఇప్పటికీ ఈ సినిమా జోరు బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం కూడా తగ్గలేదు. నిన్న భారీ అంచనాల నడుమ విడుదలైన ‘కన్నప్ప’ చిత్రం ఈ సినిమాపై ఏమైనా ప్రభావం చూపిస్తుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఇసుమంత ప్రభావం కూడా చూపించలేదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 8వ రోజున 3 కోట్ల 53 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి .
అనేక A సెంటర్స్ లో ఈ చిత్రం నిన్న విడుదలైన ‘కన్నప్ప'(Kannappa Movie) కి సరిసమానమైన వసూళ్లను రాబట్టింది. కొన్ని సెంటర్స్ లో అయితే కన్నప్ప ని సైతం డామినేట్ చేసింది. తమిళ వెర్షన్ వసూళ్లు కలిసి రావడం లేదు కానీ, ఒకవేళ తమిళనాడు వసూళ్లు కూడా బాగా ఉండుంటే ఈ సినిమా రేంజ్ బాక్స్ ఆఫీస్ పరంగా మరో లెవెల్ లో ఉండేది. ఇక తెలుగు రాష్ట్రాల నుండి 8వ రోజు ఈ చిత్రానికి కోటి 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 8 రోజులు నాన్ స్టాప్ గా కోటికి పైగా షేర్ వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఈ చిత్రం కూడా నిలిచిపోయింది. ఈరోజు రేపు కూడా తెలుగు రాష్ట్రాల నుండి కోటికి పైగా షేర్ వసూళ్లు వస్తాయి. ఓవరాల్ గా 8 రోజులకు కలిపి ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 31 కోట్ల 74 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 53 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ప్రాంతాల వారీగా చూస్తే తమిళ నాడు నుండి 18 కోట్ల 45 లక్షలు, కర్ణాటక నుండి 8 కోట్ల 15 లక్షలు, కేరళ నుండి కోటి 18 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఓవర్సీస్ లో అయితే దాదాపుగా 27 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. ఈ వీకెండ్ కచ్చితంగా మంచి గ్రాస్ నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 56 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 111 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో మరో 20 నుండి 30 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.