Theaters Percentage System: గత కొన్ని రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీలో దారుణమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎప్పటికప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు వార్తల్లో నిలుస్తుండటం విశేషం…కొద్దిరోజుల క్రితం సినీ కార్మికులు వాళ్లకు వేతనాలను పెంచాలని సమ్మె చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక వాళ్ళు ఎట్టకేలకు ప్రొడ్యూసర్స్ 15% వేతనాలను పెంచడానికి ఒప్పుకున్నారు. ఇక ఆ సమస్య తీరిపోయిందో లేదో ఇప్పుడు మరో పెద్ద సమస్య వచ్చి పడింది. అదే థియేటర్ల పర్సంటేజ్ సిస్టమ్…ప్రస్తుతం సింగిల్ థియేటర్లు చాలా వరకు మూతపడుతున్నాయి. వాటిని బతికించాల్సిన అవసరం కూడా నిర్మాతల మీదే ఉందని సగటు ప్రేక్షకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే చాలా థియేటర్లు ఫంక్షన్ హాల్స్ గా, ఫంక్షన్ హాల్స్ గా మారుతుండటం మనం చూస్తూనే ఉన్నాము. ఇక మీదట అలాంటి పరిస్థితి రావద్దంటే థియేటర్లకి పర్సంటేజ్ సిస్టమ్ ను తీసుకురావాల్సిన అవసరమైతే ఉంది. ఈ పర్సంటేజ్ సిస్టమ్ వల్ల ప్రతి సినిమాకి ఎంత పర్సంటేజ్ ఎగ్జిబ్యూటర్లు తీసుకోవాలి.
డిస్ట్రిబ్యూటర్లకు ఎంత పర్సంటేజ్ వెళ్తుంది అనేది ముందుగానే నిర్ణయించుకుంటారు. దీనివల్ల థియేటర్లకు కూడా పెద్దగా నష్టమైతే రాదు. మరి ఇలాంటి ఒక సిస్టంను పెడితే అటు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ యజమానులు అయిన ఎగ్జిబ్యూటర్లు కూడా ఎంతో కొంత లాభాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు ఎగ్జిబ్యూటర్లందరూ కలిసి డిసెంబర్ ఒకటోవ తేదీ వరకు పర్సంటేజ్ సిస్టం ని కల్పించాలని లేకపోతే డిసెంబర్ 2 నుంచి థియేటర్లు మొత్తం మూసి వేయబోతున్నం వాళ్లు డిస్ట్రిబ్యూటర్ల గ్రూపుల్లో ఒక లేఖనైతే సర్క్యులేట్ చేస్తున్నారు. మొత్తానికైతే ఈ లేక అఫీషియల్ గా బయటికి వచ్చింది.
మరి దీని మీద సినీ పెద్దలు గాని, ప్రొడక్షన్ కౌన్సిల్ గాని, ఫిలిం ఛాంబర్ గాని ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఇక మూతపడుతున్న థియేటర్లని బతికించే ప్రయత్నం చేస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇప్పటి వరకు ఇండస్ట్రీ లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికి ఇప్పుడు థియేటర్లను బతికించాల్సిన అవసరం మాత్రం ఉంది…లేకపోతే చిన్న సినిమాలకు భారీగా దెబ్బ పడే అవకాశాలైతే ఉన్నాయి…
The Talk of Theaters Bandh is Back
Percentage సిస్టం అమలు చెయ్యకపోతే డిసెంబర్ 2 నుండి థియేటర్స్ బంద్ అంటూ డిస్ట్రిబ్యూటర్స్ గ్రూప్ లో చర్చలు మొదలు #TheatersStrike pic.twitter.com/OdLMGgzz8p
— M9 NEWS (@M9News_) October 4, 2025