Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా గొప్ప క్రేజ్ ఉంది. ఆయన క్రియేట్ చేసిన ఆరా అంతా ఇంతా కాదు. కేవలం ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు సినిమాలు సూపర్ సక్సెస్ అవుతాయని నమ్మే వాళ్లు చాలామంది ఉన్నారు. ఆయన కోసం ప్రత్యేకంగా స్టోరీ రాయాల్సిన పని లేదు ఆయన స్క్రీన్ మీద నడిస్తే చాలు అని ప్రముఖ రచయిత అయిన ‘విజయేంద్ర ప్రసాద్’ లాంటి గొప్ప రైటర్ చెప్పారు. దాంతో పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటనేది అందరికీ తెలిసింది. అలాంటి పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన చేసిన ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించింది. దాంతో పాటుగా తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవడానికి అవకాశం దొరికింది… ప్రస్తుతం ఓజీ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మరి ఇలాంటి సందర్భంలో ఇక మీదట పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి సినియాలు రాబోతున్నాయి అనే ధోరణిలో అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఇప్పటికే కమిట్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాని పూర్తి చేసిన తర్వాత ఆయన మరికొన్ని సినిమాలకు కమిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి… పవన్ కళ్యాణ్ గతంలో క్రియేట్ చేసిన ఒక రికార్డును స్టార్ హీరోలెవ్వరు చేయలేకపోయారు.
అదేంటి అంటే తొలిప్రేమ సినిమా రైట్స్ ను నైజాంలో కోటి రూపాయలు పెట్టి తీసుకుంటే ఒక్క సంధ్య థియేటర్లోనే దాదాపు రెండు కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టిందట. అలాగే ఖుషీ సినిమాను నైజాం లో 2 కోట్లు పెట్టి కొంటే ఒక్క సంధ్య థియేటర్ లోనే 3 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ రెండు సినిమాలు భారీ రేంజ్ లో కలెక్షన్స్ ని రాబట్టడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఒక్క థియేటర్లోనే అంత భారీ మొత్తంలో అమౌంట్ రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.
మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి ఏ హీరోలకి సంధ్య థియేటర్లో ఇలాంటి రికార్డులు పెద్దగా నమోదు కాలేదనే చెప్పాలి. అందుకే పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ తీసుకోవడానికి నైజాం డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ మేనియా నైజాంలో చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా హీరోలతో పోలిస్తే ఆయనకు నైజాం ఏరియా కంచుకోట అనే చెప్పాలి…