Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పుష్ప 2’ నిన్న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టాక్ కారణంగా ఈ చిత్రానికి మొదటి రోజు 280 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బాలీవుడ్ లో అయితే ఏకంగా జవాన్ రికార్డ్స్ ని కూడా బద్దలు కొట్టి ఆల్ టైం టాప్ 1 గా నిల్చింది. ఇలా రాజమౌళి సహాయం లేకుండా మొదటి రోజు ఇండియా వైడ్ గా ఆల్ టైం రికార్డు పెట్టిన ఏకైక హీరో గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్జ్ చరిత్ర సృష్టించాడు. రెండవ రోజు కూడా ఈ చిత్రానికి ఇదే రేంజ్ ట్రెండ్ కొనసాగుతుంది. విచిత్రం ఏమిటంటే ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో కంటే బాలీవుడ్ లో ఎక్కువ వసూళ్లు రావడమే.
కేవలం బాలీవుడ్ నుండే ఈ సినిమాకి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ రేంజ్ లో ప్రస్తుతం ట్రెండ్ నడుస్తుంది. మొదటి రోజు 72 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను హిందీ వెర్షన్ లో రాబట్టిన ఈ సినిమా, రెండవ రోజు 50 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే నేడు ముంభై లోనే బాంద్రా ప్రాంతంలో ఉండే గెలాక్సీ థియేటర్ లో ఈ సినిమాని ప్రదర్శిస్తున్న సమయంలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఈ సినిమా ఇంటర్వెల్ సమయంలో గుర్తు తెలియని కొంతమంది దుండగులు థియేటర్ లో ‘పెప్పర్ స్ప్రే’ కొట్టి పారిపోయారు. దీంతో థియేటర్ లో ఉన్న ప్రేక్షకులకు ఊపిరి ఆడక, విపరీతమైన దగ్గుతో థియేటర్ నుండి బయటకు పరుగులు తీశారు. కొంతమంది ప్రేక్షకులు తీవ్రమైన అస్వస్థతకు గురి అవ్వగా వాళ్ళని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం ప్రాణాపాయం ఏమి లేదు కానీ, ఇంతకీ ఎవరు ఆ దుండగులు?, థియేటర్ లో పెప్పర్ స్ప్రే కొట్టి పారిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?, అసలు ఏమి జరిగింది అనే వాటిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దొంగతనం చేసే ఉద్దేశ్యం ఉన్నోళ్లు లాగా కూడా వాళ్ళు అనిపించడం లేదు. ఎందుకంటే ప్రేక్షకుల దగ్గర నుండి ఒక్క పైసా కూడా బయటకి పోలేదు. కచ్చితంగా ఎదో అలజడి సృష్టించి అల్లర్లు లేపేందుకే ఇలాంటి ప్రయత్నం చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి, మీరు కూడా ఈ వీడియోస్ ని చూడండి. ఇకపోతే ఇదే థియేటర్ లో గతంలో పుష్ప పార్ట్ 1 చిత్రం అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధించి బాలీవుడ్ సినిమాలను సైతం డామినేట్ చేసింది.
పుష్ప 2 థియేటర్లో పెప్పర్ స్ప్రే
కొట్టిన దుండగులు.. పలువురికి అస్వస్థతముంబై – బాంద్రా ఏరియాలో ఉండే గెలాక్సీ థియేటర్లో పుష్ప 2 సినిమా ప్రదర్శిస్తూ ఉండగా ఇంటర్వెల్ సమయంలో గుర్తు తెలియని దుండగులు పెప్పర్ స్ప్రే కొట్టడంతో ప్రేక్షకులు ఊపిరి ఆడక, దగ్గుతో థియేటర్ నుంచి బయటకు… pic.twitter.com/Or5nszMFzb
— Telugu Scribe (@TeluguScribe) December 6, 2024