https://oktelugu.com/

Sobhita Dhulipala: కుక్క కంటే హీనమా? ఘోరమైన అవమానం ని ఎదురుకున్న శోభిత దూళిపాళ్ల..ఆవేశంతో రగిలిపోతున్న అక్కినేని ఫ్యాన్స్!

రీసెంట్ గానే ఈమె అక్కినేని నాగచైతన్య ని పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. పెద్దగా హంగులు, ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా వీళ్లిద్దరి వివాహ మహోత్సవం జరిగిపోయింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 6, 2024 / 05:01 PM IST

    Sobhita Dhulipala

    Follow us on

    Sobhita Dhulipala: తెలుగు అమ్మాయిగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత సినీ రంగ ప్రవేశం చేసి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న హీరోయిన్ శోభిత దూళిపాళ్ల. తెనాలి లో పుట్టి పెరిగిన ఈమె, ఒక అప్పర్ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఈమె తండ్రి మర్చంట్ నేవీ మ్యానేజర్, తల్లి ఒక టీచర్. విద్యాబ్యాసం పూర్తి అయ్యాక కుటుంబం మొత్తం వైజాగ్ లో స్థిరపడింది. చదువులో గొప్పగా రాణించిన శోభితకి సినిమాల మీద కూడా చిన్నప్పటి నుండి విపరీతమైన మక్కువ ఉండేది. ఎప్పటికైనా తనని తానూ వెండితెర పై చూసుకోవాలని అనుకునేది. ఆ ఇష్టంతోనే ఈమె మోడలింగ్ రంగంలోకి వచ్చింది. ఇండస్ట్రీ లో హీరోయిన్ అవకాశాలు అంత తేలికగా రావు అనే విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో మోడలింగ్ చేసే అమ్మాయిలకు కనీసం కమర్షియల్ యాడ్స్ లో నటిస్తే చాలు అని అనుకునేవారు. శోభిత కూడా అలాంటి చిన్నచిన్న కోరికలు ఉన్న అమ్మాయే.

    అలా ఆమె మోడల్ గా కొనసాగుతున్న రోజుల్లో తనకి ఎదురైనా ఒక చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో శోభిత ఎమోషనల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ ‘ ఒక కమర్షియల్ యాడ్ లో నటించే అవకాశం దక్కింది. అంతా సజావుగా సాగి సరిగ్గా కెమెరా ముందుకు వెళ్లే ముందు, కెమెరామెన్ కెమెరా రిపేర్ వచ్చిందని, ఈరోజు షూటింగ్ లేదని పంపేశాడు. ఆ తర్వాత మరుసటి రోజు వారి నుండి ఎలాంటి పిలుపు అందలేదు. నాతో తీద్దాం అనుకున్న ఆ యాడ్ ఒక కుక్కని పెట్టి తీశారు. నా స్థానంలో కుక్కని పెట్టి తీయడం నాకు చాలా అవమానం గా అనిపించింది. కనీసం కుక్కకి ఉన్న విలువ కూడా నాకు లేదా అని చాలా మనస్తాపానికి గురయ్యాను. కానీ ఎవరైతే నాకు అలాంటి అవమానం చేసారో, వాళ్ళే నాతో ఒక పెద్ద యాడ్ చేసారు. అందులో ఐశ్వర్య రాయ్ తో కలిసి నటించే ఛాన్స్ దక్కింది’ అంటూ చెప్పుకొచ్చింది శోభిత దూళిపాళ్ల.

    ఇకపోతే రీసెంట్ గానే ఈమె అక్కినేని నాగచైతన్య ని పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. పెద్దగా హంగులు, ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా వీళ్లిద్దరి వివాహ మహోత్సవం జరిగిపోయింది. కేవలం నాగార్జున కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే ఇండస్ట్రీ లోని ప్రముఖులతో పాటు, పలు వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులూ కూడా ఈ వివాహ మహోత్సవంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి వెళ్లారు. వీళ్ళ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. పెళ్లి వీడియో కోసం ఎదురు చూస్తున్నారు కానీ, ఆ వీడియో నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసిందని, నయనతార పెళ్లి వీడియో ని ఎలా అయితే ఒక డాక్యుమెంటరీ గా చేసి విడుదల చేసారో, అలా ఈ వీడియో ని కూడ విడుదల చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.