People Star R Narayana Murthy: ఆయన ఓ సినిమా నటుడు.. అంతేకాదు నిర్మాత, దర్శకుడు కూడా.. ఆయన తీసిన, నటించిన కొన్ని సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. ఆ కాలంలో 100 రోజులకు తక్కువ కాకుండా పెద్ద సినిమాలకు పోటీ ఇచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో అతడు ఎలా ఉంటాడు? కార్లలో తిరుగుతూ.. ఎవరికి కనిపించకుండా.. ఉండాలి. కానీ ఈయన మాత్రం అందుకు విభిన్నంగా ఉంటాడు. ఆటోలో, బస్సులో ప్రయాణిస్తాడు.. చేతికి ఒక సంచిని మాత్రం వేసుకుంటాడు. ఎప్పుడో తెల్ల దుస్తులే ధరించి ప్రజలతో కలిసి పోతాడు. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. సంచలన, రికార్డులు సినిమాలు తీసిన ఆర్. నారాయణ మూర్తి. ఈ పేరు వినగానే కొందరిలో ఎమోషన్ స్టార్ట్ అవుతుంది. మరికొందరిలో ఉత్తేజం వస్తుంది. కానీ ఆయన జీవితం మాత్రం నిరాడంబరం. ఆర్ నారాయణ మూర్తి లేటెస్ట్ గా తీసిన, నటించిన సినిమా ‘యూనివర్సిటీ పేపర్ లీక్.’ఈ సందర్భంగా ఆయన గురించి వివరాల్లోకి వెళితే..
ఆర్ నారాయణ మూర్తి ఒక సినిమా నటుడు. కానీ అందరిలా సాధారణ నటుడు కాదు. తనదైన పంథాలో వెళుతూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎవరైనా సినిమాలో అవకాశం వస్తుందని చూస్తారు. కానీ ఆర్ నారాయణ మూర్తి మాత్రం తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తాడు. ‘నేరము -శిక్ష ‘ అనే సినిమాలో తొలిసారిగా నటించిన ఆర్ నారాయణ మూర్తి..’ సంగీత ‘ అనే సినిమాతో హీరో అయ్యాడు. అయితే నిర్మాత, దర్శకులకు విరుద్ధంగా ఉండడంతో ఆయనకు తొలుత అవకాశాలు రాలేదు. దీంతో కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం ఆయనే ఉంటూ సినిమాలు తీశాడు. అలా మొదటిసారిగా ‘అర్ధరాత్రి స్వాతంత్ర్యం’అనే సినిమాను తీశాడు. అప్పటినుంచి ప్రతి సినిమాకు అన్ని ఆయనే.
అయితే ఆయన తీసే సినిమాలు కొందరికి మద్దతుగా ఉన్నాయంటూ పోలీసులు అడిగిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆయన తీసిన సినిమాకు వచ్చే వారిని పోలీసులు ప్రత్యేకంగా పరిశీలించారంటే అప్పటి పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రజా సమస్యలు, పోరాటాలు, ఆందోళనలను బేస్ చేసుకొని సినిమాలు తీసేవారు. ఎన్నో పెద్ద సినిమాల్లో అవకాశం వచ్చినా వదులుకునేవారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాలో అవకాశం వచ్చినా.. వదులుకున్నారు. ఎందుకంటే ఆయన సాంప్రదాయ సినిమాల్లో నటిస్తే.. తన మార్కు పోతుందన్న భయం.
Also Read: ఇండియాలో కమర్షియల్ సినిమాను పెర్ఫెక్ట్ గా తీసే దర్శకులు వీళ్ళే..?
ఆర్ నారాయణమూర్తి పర్సనల్ విషయానికి వస్తే బిఏ పూర్తి చేసి సినిమాలోకి వచ్చారు. అయితే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. కానీ ఆ తర్వాత కుదరలేదు. దీంతో ఒంటరిగాని జీవిస్తున్నాడు. ఏ మాత్రం ఆశలకు పోకుండా.. కాస్ట్లీ లైఫ్ కు దూరంగా ఉంటూ ప్రజలతోనే.. ప్రజల్లోనే కలిసిపోతాడు. ఇటీవల ఆయన తీసిన ‘యూనివర్సిటీ పేపర్ లీక్’సినిమా కోసం ఆర్.నారాయణమూర్తి పలు టీవీ ఛానల్ లో కనిపిస్తున్నాడు. వాస్తవానికి ఆయన ఇలా కనిపించడం చాలా అరుదు. అయితే ఇది సినిమా ప్రమోషన్ కోసం అని కాకుండా తన జీవిత గమ్యం ఏంటో చెప్పడానికి అని అనడం విశేషం. ఆర్ నారాయణ మూర్తి గురించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సినిమాల్లో అరుగుదైన వ్యక్తి అని అంటుంటారు. డబ్బుకు ఏమాత్రం లొంగరని కొందరు దర్శకులు పేర్కొంటారు. ఈ కాలంలో కూడా ఇలాంటి నటుడు ఉండడం తెలుగు ఇండస్ట్రీకి ప్రత్యేకమని చెప్పుకోవాలి.