Vivekananda Reddy Case: వైయస్ వివేకానంద రెడ్డి( Y S Vivekananda Reddy ) హత్య కేసులో కీలక మలుపు. ఆ కేసు విషయంలో పోరాడుతున్న వివేకానంద కుమార్తె, అల్లుడు, కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారి రామ్ సింగ్ పై వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నమోదు చేసిన తప్పుడు కేసులను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇది తప్పకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాకింగ్ పరిణామమే. ఎందుకంటే ఈ కేసు విచారణలో భాగంగా కోర్టులో జరిగిన వాదనలు కేసు తీవ్రతను, భవిష్యత్తులో వచ్చే తీర్పులను స్పష్టం చేశాయి. ఏకంగా వైసిపి ప్రభుత్వం వేసిన తప్పుడు కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సైలెంట్ వాతావరణం కనిపిస్తోంది. కచ్చితంగా భవిష్యత్తులో వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలన తీర్పులు వచ్చే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Also Read: వైసిపి నేతల బెయిల్ వెనుక బిజెపితో బిగ్ డీల్?
ఆరేళ్ల కిందట ఘటన..
2019 ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆ ఏడాది మార్చి 15న వివేక తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ముందుగా గుండెపోటు అన్నారు. తరువాత గొడ్డలి వేటు అని ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో విపరీతమైన సానుభూతి పొందారు. అయితే ఎన్నికల తరువాత వైయస్ కుటుంబంలో వచ్చిన చీలికకు వివేకానంద రెడ్డి హత్య కారణమని తేలిపోయింది. అప్పటివరకు సిబిఐ( Central Bureau of Investigation ) విచారణను కోరిన జగన్మోహన్ రెడ్డి… ఏపీ సిఐడితో సరిపెట్టాలని చూశారు. అప్పుడే ఎదురు తిరిగారు వివేకా కుమార్తె సునీత. ఎట్టి పరిస్థితుల్లో సిబిఐ విచారణ జరగాల్సిందేనని తేల్చి చెప్పారు. కోర్టును ఆశ్రయించడంతో సిబిఐ దర్యాప్తు ప్రారంభం అయింది. రామ్ సింగ్ లాంటి విచారణ అధికారి రావడంతో దర్యాప్తు చాలా దూకుడుగా ముందుకు సాగింది. ఆ సమయంలోనే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సునీత దంపతులతో పాటు రాంసింగ్ పై కేసులు నమోదు చేసింది. ఇప్పుడు అవే కేసులను సుప్రీంకోర్టు కొట్టి వేయడం ద్వారా.. భవిష్యత్తులో ఈ కేసులో సంచలన తీర్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో వాదనలు వినిపిస్తున్న న్యాయవాది.. ఇది ఫ్రీ ప్లాన్ మర్డర్ అని.. తప్పకుండా మరణశిక్ష విధించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించడం తీవ్రతను తెలియజేస్తోంది.
కేసు కొట్టివేత..
అయితే వైసిపి( YSR Congress party ) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వారిపై కేసులు నమోదు చేసి ఇబ్బంది పెట్టింది. అదే కేసు ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానంలో కొట్టివేయడం జరిగింది. అయితే ఈ కేసు పై మాట్లాడేందుకు వైసిపి నేతలు ముందుకు రావడం లేదు. సకల శాఖామంత్రిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి కానీ.. కట్టు కథలు అల్లే జగన్ మీడియా కానీ అటువైపు తొంగి చూడడం లేదు. సుప్రీంకోర్టులో చిన్నపాటి మినహాయింపులు దొరికితే సజ్జల వారితో పాటు సాక్షి మీడియా రెచ్చిపోయేది. కానీ ఫుల్ సైలెన్స్ వెనుక కారణాలు అందరికీ తెలిసిన విషయమే. తప్పకుండా వివేకానంద రెడ్డి హత్య కేసు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముమ్మాటికీ ఇబ్బందికరమే.
Also Read: ఎమ్మెల్యేతో బియ్యం బస్తా మొయించిన మహిళ.. వైరల్!
ఆ ముగ్గురిపై ఆరోపణలు..
ఇంతవరకు వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత( Sunita), అల్లుడు రాజశేఖర్ రెడ్డి ప్రధాన నిందితులని.. సిబిఐ విచారణ అధికారి రామ్ సింగ్ ఈ కేసును వారికి అనుకూలంగా తారుమారు చేయాలని కుట్రలు చేశారని.. వారికి చంద్రబాబు సహకరించే వారిని జగన్ అండ్ అనుకూల మీడియా కట్టు కథలు అల్లేది. కానీ సుప్రీంకోర్టు తాజా తీర్పుతో వారి వాదనలు తప్పు అని స్పష్టమవుతోంది. అవన్నీ అబద్దమని తేలుతున్నాయి. కచ్చితంగా 2029 ఎన్నికల నాటికి పులివెందులలో వివేకానంద రెడ్డిని హత్య చేసింది ఎవరు అన్నది స్పష్టం అవుతుంది. అప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సింది ఎవరో అందరికీ తెలిసిన విషయమే.