100 % Love Child Artist: బాలనటులుగా నటించిన ఎంతో మంది రీసెంట్ టైం లో సినిమాల్లో లీడింగ్ క్యారెక్టర్స్ చేస్తూ మన ముందుకు వస్తున్నారు. వాళ్ళని చూసిన వెంటనే బుడ్డోడిగా కనిపించిన ఇతను అకస్మాత్తుగా ఇంత ఎదిగిపోయాడేంటి అని ఆశ్చర్యపోతూ ఉంటాము. ఇలాంటి షాకులు ఆడియన్స్ కి ఈమధ్య కాలం లో చాలానే తగిలాయి. అలా మన కళ్ళ ముందే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఒక బుడ్డోడు ఇప్పుడు లీడింగ్ క్యారక్టర్ చేసే రేంజ్ ఎదిగిపోయాడు. అతను మరెవరో కాదు నిఖిల్ అబ్బూరి(Nikhil Abburi). పైన ఫొటోలో చూస్తున్నారుగా. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ‘100 % లవ్’ చిత్రం లో చిన్న పిల్లల గ్యాంగ్ లో చాలా చలాకీగా డైలాగ్స్ కొడుతూ కనిపిస్తాడు చూసారా?, అతనే ఇతను. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ తో పాటు అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.
Also Read: రోజురోజుకు పడిపోతున్న ‘కూలీ’ వసూళ్లు..6వ రోజు వచ్చింది ఎంతంటే!
అలా బాలనటుడిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ బుడ్డోడు, పెద్దయ్యాక మొదటిసారి ఈటీవీ లో సుడిగాలి సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన కామెడీ స్టార్స్ అనే ప్రోగ్రాం కి ఒక్కసారి గెస్ట్ గా వస్తాడు. అప్పుడే తెలిసింది ఇతను 100 % లవ్ చిత్రం లో బూరె బుగ్గలు వేసుకొని కనిపించిన బుడ్డోడు అని. కుర్రాడు చాలా చలాకీగా ఉన్నాడు, కచ్చితంగా సినిమాల్లోకి కూడా త్వరలో వస్తారని ఆడియన్స్ అంచనా వేశారు. అనుకున్నట్టుగానే వచ్చేశాడు. మౌళి టాక్స్ ద్వారా సోషల్ మీడియా లో ఎంతో పాపులారిటీ ని సంపాదించిన మౌళి హీరో గా లిటిల్ హార్ట్స్ అనే చిత్రం తెరకెక్కింది. మౌళి ఈ సినిమాకు ముందు ఈటీవీ విన్ యాప్ లో ’90s’ అనే సూపర్ హిట్ వెబ్ సిరీస్ లో కూడా నటించాడు. ఈ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని రీసెంట్ గానే విడుదల చేశారు. ఈ టీజర్ లో మౌళి పక్కన ఉండే ఇద్దరి స్నేహితులతో ఒకరిగా నిఖిల్ అబ్బూరి నటించాడు. చూస్తుంటే ఇతనికి కూడా ఈ చిత్రం లో హీరోతో సమానమైన క్యారక్టర్ పడినట్టుగా అనిపిస్తుంది. నిఖిల్ ని ఎవ్వరూ పెద్దగా గమనించలేదు. కానీ సినిమా విడుదల తర్వాత ఇతని పేరు గట్టిగా వినిపించేలా ఉంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో నిఖిల్ రేంజ్ ఎలా ఉండబోతుంది అనేది.