Pekamedalu Teaser Review: పేకమేడలు టీజర్ రివ్యూ: పేరేమో లక్ష్మణ్ చేసేవన్నీ లత్కోర్ పనులు!

పేకమేడలు. వినోద్ కిష‌న్‌, అనూష క్రిష్ట జంట‌గా న‌టించారు. నీలగిరి మామిళ్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Written By: Shiva, Updated On : July 28, 2023 12:13 pm

Pekamedalu Teaser Review

Follow us on

Pekamedalu Teaser Review: మన పెద్దలు తరుచుగా చెప్పే మాటల్లో అతి ముఖ్యమైనది. రేయ్ పేకమేడలు కట్టకండి అంటూ దాన్ని టైటిల్ గా మార్చి ఎవరికీ చెప్పొద్దు అనే సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్ సంస్థ ఇప్పుడు మరొక భిన్నమైన సినిమాతో మన ముందుకు రాబోతుంది. అదే పేకమేడలు. వినోద్ కిష‌న్‌, అనూష క్రిష్ట జంట‌గా న‌టించారు. నీలగిరి మామిళ్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లైంది.

జులాయిగా తిరిగే లక్ష్మణ్ అనే కుర్రాడి స్టోరీ నే ఈ సినిమా. చేసేది ఏదో చిన్న చితకా పనులు కానీ పైకి మాత్రం పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకుంటూ, గాలిలోనే పేకమేడలు కడుతూ, ప్రతి దానికి అబద్ధాలు చెబుతూ లో-క్లాస్స్ లో ఉన్న కానీ హై క్లాస్ బతుకు బతకాలనుకునే కుర్రోడి కథ. పైకి లక్ష్మణ్ అనే పేరు పెట్టుకున్న కానీ చేసేవి అన్ని లత్కోరు పనులు అందుకే అతన్ని లత్కోర్ లక్ష్మణ్ అని పిలిచేవాళ్ళు ఉంటారు. ఈ టీజర్ చూస్తూనే కామెడీ ప్రధానంగా సాగే సినిమాగా కనిపిస్తుంది.

అదే విధంగా ప్రతి దానికి అబద్ధాలు ఆడుతూ బతికే లక్ష్మణ్ కి ఆ అబద్దాల వలన కలిగే అనర్థాలు ఏమిటి ? అసలు తానెందుకు ఇలా చేయాల్సి వచ్చింది అనేది తెరమీద చూడాలి. ఈ సినిమా టీజర్ ను మాస్ కా దాస్ విష్వక్ సేన్ విడుదల చేయటం జరిగింది. ఇక ఈ సినిమా నిర్మాత రాకేష్ వ‌ర్రే మాట్లాడుతూ ”నేను హీరోగా చేసిన ఎవ‌రికీ చెప్పొద్దు.. ఊహించ‌ని విజ‌యాన్ని అందుకొంది. మూడు రోజుల్లో తీసేయాల్సిన సినిమా అది. 30 రోజులు ఆడింది. నెట్ ఫ్లిక్స్ ద్వారా మ‌రింత పాపుల‌ర్ అయ్యింది. ఈసారి మాత్రం నిర్మాత‌గానే ఈ సినిమా తీశా. స్టాండ‌ర్డ్స్‌లో తొలి సినిమాని మించి ఉంటుంది. వినోదం కూడా అదే స్థాయిలో పండించాం” అన్నారు. ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎదుర‌య్యే క‌థ ఇద‌ని, అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంద‌ని ద‌ర్శ‌కుడు తెలిపారు.

ఈ రోజుల్లో చిన్న సినిమాలకు మంచి డిమాండ్ నడుస్తుంద. సినిమాలో కొంచెం విషయం ఉన్న కానీ ఊహించని రేంజ్ లో సక్సెస్ అవుతుంది. దానికి తాజా ఉదాహరణే బేబీ. అతి చిన్న సినిమాగా విడుదలై కేవలం 12 రోజుల్లో 70 కోట్ల లకు పైగా వసూళ్లు సాధించి దూసుకెళ్తుంది. అయితే చిన్న సినిమాలకు ఉన్న అతి పెద్ద మైనస్ ఏమిటంటే విడుదల రోజు సరైన ఓపెనింగ్స్ అనేవి ఉండవు. సినిమా కొంచెం తేడా కొట్టిన తర్వాత రోజే దుకాణం బంద్. అదే కనుక హిట్ టాక్ వస్తే మాత్రం భారీ విజయం ఖాయం.