Peddi Teaser : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది'(Peddi Movie) చిత్రానికి సంబంధించిన టీజర్ ని నేడు విడుదల చేయగా, దానికి సోషల్ మీడియా లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా టీజర్ లోని చివరి షాట్ కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా రిపీట్ గా చూస్తున్నారు. ఫలితంగా యూట్యూబ్ లో ఈ టీజర్ సరికొత్త రికార్డ్స్ ని నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతుంది. పెద్ది తెలుగు వెర్షన్ టీజర్ ని ‘వృద్ధి సినిమాస్’ అనే యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేసారు. ఈ టీజర్ విడుదలకు ముందు కేవలం ఆ ఛానల్ లో 5 వేల మంది మాత్రమే ఉన్నారు. కానీ ఇప్పుడు 35 వేల మంది ఈ ఛానల్ కి ‘subscribe’ అయ్యారు. కొత్త ఛానల్ కదా వ్యూస్, లైక్స్ సరిగా రావేమో అని ఫ్యాన్స్ భయపడ్డారు.
Also Read : ఎక్కడ చూసిన ‘పెద్ది’ షాట్..క్రికెటర్లను మించి..సోషల్ మీడియా ఊగిపోతుందిలా!
కానీ ఈ టీజర్ కొత్త ఛానల్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. టీజర్ విడుదలై 7 గంటలు అయ్యింది. ఈ 7 గంటల్లో దాదాపుగా 13 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇది సాధారమైన విషయం కాదు. ఇక లైక్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు 3 లక్షల 40 వేలు వచ్చాయి. ఈరోజు ముగిసే సమయానికి నాలుగు లక్షల టార్గెట్ కి చేరుకోవచ్చు. 24 గంటలు ముగిసే సమయానికి 5 లక్షల మార్కుని కూడా అందుకోవచ్చు. ఫుల్ రన్ లో కచ్చితంగా ఈ టీజర్ 100 మిలియన్ వ్యూస్ మార్కుని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే అలాంటి కంటెంట్ ఈ టీజర్ లో ఉంది కాబట్టి. ముఖ్యంగా టీజర్ లోని చివరి షాట్ ఈ IPL సీజన్ లో బాగా వైరల్ అయ్యే అవకాశం ఉంది. పెద్ద పెద్ద క్రికెట్ హ్యాండిల్స్ కూడా ఈ వీడియో ని రాబోయే రోజుల్లో ఉపయోగించుకోవచ్చు.
ఇకపోతే ఇప్పటికే రెండు కీలకమైన షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, మూడవ షెడ్యూల్ ని త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఈ షెడ్యూల్ ఢిల్లీ లో జరగనుంది. కుస్తీ కి సంబంధించిన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించబోతున్నారు. ఢిల్లీ లోని చారిత్రాత్మిక కట్టడాల్లో షూటింగ్ జరగబోతుందట. అంతే కాదు పార్లమెంట్ లో కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్ కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా పాల్గొనబోతున్నాడట. వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా, అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే రామ్ చరణ్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలుస్తుందా లేదా అనేది చూడాలి.
Also Read : స్టేజి మీద వైష్ణవి చైతన్య బూతులు..కవర్ చేసిన హీరో సిద్ధు..వీడియో వైరల్!