Peddi Movie : సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఇప్పుడు రామ్ చరణ్(Global Star Ram Charan) పెద్ది(Peddi Movie) మేనియా నే కనిపిస్తుంది. ఈరోజు విడుదల చేసిన టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ కి ‘సెన్సేషన్’ అనే పదం ఉపయోగిస్తే చాలా తక్కువ అవుతుంది. అంతకు మించిన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా టీజర్ లాస్ట్ షాట్ లో రామ్ చరణ్ కొట్టిన సిక్సర్ సోషల్ మీడియా లో వైల్డ్ ఫైర్ లాగా వ్యాప్తి చెందింది. మహేంద్ర సింగ్ ధోని ‘హెలికాఫ్టర్ షాట్’, రోహిత్ శర్మ షాట్ లాగా ‘పెద్ది షాట్’ అనే పేరు ఒక రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. కేవలం రామ్ చరణ్ అభిమానులు మాత్రమే కాకుండా, ఇతర హీరోల అభిమానులు కూడా ఈ షాట్ ని తమ అభిమాన హీరోతో కలిపి ఎడిటింగ్ చేసి, ఆ వీడియోలను సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తున్నారు.
Also Read : ‘పెద్ది’ టీజర్ వచ్చేసింది..ఫస్ట్ షాట్ సిక్సర్..లాస్ట్ షాట్ అరాచకం
ఇంతకు ముందు ట్రోల్స్ చాలా సీరియస్ గా చేసుకునేవాళ్ళు. కానీ ఈ టీజర్ లోని షాట్స్ ని ట్రోల్స్ కోసం ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్(Junior NTR), రామ్ చరణ్, అల్లు అర్జున్(Icon Star Allu Arjun) అభిమానులు అయితే ఎన్ని ఎడిటింగ్ వీడియోలు చేసారో లెక్కే తెలీదు. ఇది ఇప్పట్లో ఆగదు అనే చెప్పాలి. పైగా ప్రస్తుతం IPL సీజన్ నడుస్తుంది. తమ అభిమాన క్రికెటర్ ఎవరైనా సరే భారీ షాట్ ని కొట్టినప్పుడు పెద్ది టీజర్ లోని చివరి షాట్ ని ఉపయోగించుకుంటారు. మూవీ టీం గురి చూసి సెన్సేషనల్ టీజర్ ని విడుదల చేశారనే చెప్పాలి. సినిమా మీద ఈ ఒక్క టీజర్ తో హైప్ తారా స్థాయికి చేరింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రమోషనల్ కంటెంట్ వదులుతూ పోతే ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడుతాయి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న కొన్ని ఫన్నీ ఎడిటింగ్ వీడియోస్ ని మీకోసం అందిస్తున్నాము, చూసి ఎంజాయ్ చేయండి. రామ్ చరణ్ కి ఈమధ్య కాలం లో ఈ రేంజ్ టీజర్ కట్ పడలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. AR రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈమధ్య కాలంలో పెద్దగా ఫామ్ లో లేని రెహ్మాన్, ఈ సినిమాతో పీక్ రేంజ్ ఫామ్ లోకి రాబోతున్నాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. టీజర్ లో ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. చూసే ఫ్యాన్స్ కి, ఆడియన్స్ కి ఈ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఫ్రెష్ ఫీల్ ని ఇచ్చింది. మరి పాటలు కూడా ఇదే రేంజ్ లో ఇస్తాడా లేదా అనేది చూడాలి.
Entha Pani chesavayya charanuuu#Prabhas #Ramcharan #PeddiFirstShot pic.twitter.com/LJwR6U4tyk
— Ashhu ᴿᴱᴮᴱᴸᵂᴼᴼᴰ (@PrabhAshhu_2) April 6, 2025
Ayyaa Balayyaaa pic.twitter.com/jh4T6n7jdd
— Dileepuu (@Bittu_Tweetzz) April 6, 2025
Chinni correction https://t.co/W3URSQWynb pic.twitter.com/saz1NCXCDn
— Chanandler bOnG (@BongChh) April 6, 2025
The GREATEST REDEMPTION arc that Indian cinema will witness – 27th March 2026 !
Best wishes to #Peddi, @AlwaysRamCharan & our Pithapuram Thala @BuchiBabuSana on behalf of all @PawanKalyan followers #PeddiFirstShot pic.twitter.com/TQPmE8nb49
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) April 6, 2025