SRH vs GT : ఇటీవల గుజరాత్ జట్టు బెంగళూరు తో మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్లో గుజరాత్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆ తర్వాత 170 పరుగుల విజయ లక్ష్యాన్ని గుజరాత్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి చేదించింది. తద్వారా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు విజయం సాధించడంలో మహమ్మద్ సిరాజ్ ముఖ్యపాత్ర పోషించాడు . అతడు ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి బెంగళూరు జట్టు పతనాన్ని శాసించాడు. సాల్ట్, దేవదత్ పడిక్కల్, లివింగ్ స్టోన్ వంటి ఆటగాళ్లను పెవిలియన్ పంపించాడు. ఇక ఆదివారం హైదరాబాద్ సొంత మైదానంలో జరిగిన మ్యాచ్ లోనూ సిరాజ్ అద్భుతంగా భోజనం చేశాడు. ఏకంగా నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
Also Read : సన్ రైజర్స్ ఓపెనర్లు ఇక మారరా..ఇదేం దరిద్రం?!
కీలక ఆటగాళ్లను వెనక్కి పంపించాడు
ఉప్పల్ మైదానంలో జరిగిన మ్యాచ్లో మహమ్మద్ సిరాజ్ బంతితో అద్భుతాలు చేశాడు. ఇన్ స్వింగర్.. ఊరించే బంతులు వేసి హైదరాబాద్ ఆటగాళ్లను బోల్తా కొట్టించాడు. ఓపెనర్లు అభిషేక్ శర్మ (18), హెడ్(8) అవుట్ చేసి.. హైదరాబాద్ జట్టుకు చుక్కలు చూపించిన సిరాజ్.. ప్రమాదకరమైన అనికేత్ వర్మ (18), సమర్ జీత్ సింగ్ (0) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.. తద్వారా ఐపీఎల్లో అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు.. సన్ రైజర్స్ జట్టుపై నాలుగు వికెట్లు పడగొట్టి.. ఇప్పటివరకు ఐపీఎల్లో (4/17) ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఇక 2023లో మొహాలీ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై (4/21) నాలుగు వికెట్లు పడగొట్టాడు. 2017లో ఖాన్ పూర్ వేదికగా గుజరాత్ లయన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్లు (4/32) సొంతం చేసుకున్నాడు. మొత్తంగా హైదరాబాద్ జట్టుపై 17 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీయడం ద్వారా.. తన ఐపీఎల్ కెరియర్ లో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిపాడు మహమ్మద్ సిరాజ్. మహమ్మద్ సిరాజ్ దూకుడు వల్ల హైదరాబాద్ జట్టు సొంతమైదానంలో మరోసారి విఫలమైంది. 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్ల వైఫల్యం హైదరాబాద్ జట్టుకు ప్రతిబంధకంగా మారింది. మిడిల్ ఆర్డర్ ఆటగాళ్ల నిర్లక్ష్యం జట్టు భారీ స్కోర్ చేయకుండా అడ్డంకులు వేసింది. అయితే ఈ స్కోర్ ను కాపాడుకొని విజయం సాధిస్తే మాత్రం హైదరాబాద్ జట్టు రికార్డు సృష్టించినట్టే. ప్రస్తుతం గుజరాత్ జట్టు ఉన్న ఫామ్ ప్రకారం చూసుకుంటే అది సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తంగా చూస్తే హైదరాబాద్ జట్టు మరో ఓటమిని మూట కట్టుకున్నట్టే.
Also Read : నా రిటర్మెంట్ పై అదే నిర్ణయిస్తుంది.. ధోని సంచలన వ్యాఖ్యలు