Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది'(Peddi Movie) కి సంబంధించిన టీజర్(#PeddiFirstShot) ని నిన్న శ్రీరామ నవమి సందర్భంగా మూవీ టీం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కి ఫ్యాన్స్ నుండే కాదు, ఇతర హీరోల అభిమానుల నుండి, సెలబ్రిటీల నుండి కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్ ఇలా ఎక్కడ చూసినా ఈ టీజర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ రేంజ్ లో వైరల్ అయిపోయింది. రామ్ చరణ్ అభిమానులు అయితే ‘గేమ్ చేంజర్’ చిత్రం చేసిన గాయం నుండి ఈ టీజర్ ని చూసిన వెంటనే కోలుకున్నారు. ఇది కదా రామ్ చరణ్ నుండి మేము కోరుకుంటున్నది అంటూ కామెంట్స్ ఆనందంతో ట్వీట్స్ వేస్తున్నారు. ఇకపోతే నిన్న అల్లు అర్జున్(Icon Star Allu Arjun) సోదరుడు, అల్లు శిరీష్(Allu Sirish) కూడా ఈ టీజర్ పై రెస్పాన్స్ ఇచ్చాడు.
Also Read : రామ్ చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ వచ్చేది అప్పుడే…ప్రొడ్యూసర్స్ మాటలు నిజం అవుతాయా..?
చాలా కాలం తర్వాత రామ్ చరణ్ టీజర్ కి ఆయన రెస్పాన్స్ ఇవ్వడంతో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన ట్విట్టర్ లో స్పందిస్తూ ‘పెద్ది ఫస్ట్ షాట్ మామూలు రేంజ్ లో లేదుగా..హ్యాపీ శ్రీరామ నవమి’ అంటూ కామెంట్ చేసాడు. దీనిపై అటు అల్లు అర్జున్ అభిమానుల నుండి, ఇటు రామ్ చరణ్ అభిమానుల నుండి భిన్నమైన కామెంట్స్ వినిపించాయి. సోషల్ మీడియా లో అల్లు అర్జున్, రామ్ చరణ్ అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో గొడవలు జరుగుతుంటాయి. అలాంటి సమయంలో అల్లు అర్జున్ సోదరుడు ఇలా పాజిటివ్ కామెంట్స్ చేస్తే భిన్నమైన రెస్పాన్స్ అభిమానుల నుండి రావడం సహజమే కదా. కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ‘రామ్ చరణ్ నిన్ను కూడా కొనేశాడా?’ అంటూ కామెంట్స్ చేసారు. మరికొంతమంది అల్లు అర్జున్ అభిమానులు అయితే మీ సినిమాలకు సంబంధించిన టీజర్, ట్రైలర్ విడుదలైనప్పుడు రామ్ చరణ్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు కదా, మీకెందుకు ఇవ్వాల్సిన అవసరం అంటూ కామెంట్స్ చేసారు.
కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం పాజిటివ్ గానే రియాక్షన్ ఇచ్చారు. ఎక్కువ శాతం మంది అల్లు శిరీష్ కి కృతఙ్ఞతలు తెలియచేయగా, కొంతమంది అభిమానులు మాత్రం నెగటివ్ కామెంట్స్ చేసారు. ఇకపోతే ఇటీవలే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ లో సెలబ్రిటీలందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్స్ వేశారు. కానీ అల్లు అర్జున్ నుండి మాత్రం ఎలాంటి రియాక్షన్ రాలేదు. దీనికి ఇరువురి హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియా లో కొట్లాట జరిగింది. ఇక మీడియా అయితే అల్లు అర్జున్, రామ్ చరణ్ మధ్య గ్యాప్ ఇంకా పెరిగిపోయింది అంటూ కథనాలు ప్రచారం చేశాయి. కానీ నిన్న అల్లు శిరీష్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో వీళ్ళ మధ్య అందరూ ఊహించుకున్నంత గ్యాప్ లేదని అంటున్నారు.
Also Read : ‘పెద్ది’ చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ వదిలేసుకోవడానికి కారణం ఇదేనా?
Peddi first shot mamoolu ga ledu ga! Happy Srirama Navami to all. @AlwaysRamCharan https://t.co/9CCRTgrYBH
— Allu Sirish (@AlluSirish) April 6, 2025