Peddi : బుచ్చిబాబు (Buchhi Babu) డైరెక్షన్ లో రామ్ చరణ్ (Ram Charan) హీరోగా వస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా విషయంలో చాలామంది చాలా రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరి అనుమానాలైతే తీరిపోయాయి. నిజానికి ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు బుచ్చిబాబు లాంటి యంగ్ డైరెక్టర్ రామ్ చరణ్ ను హ్యాండిల్ చేయగలడా అనే అనుమానాలైతే వ్యక్తం అయ్యాయి. కానీ వాటన్నింటికి చెక్ పెడుతూ బుచ్చిబాబు రామ్ చరణ్ ను చాలా అద్భుతంగా చూపించబోతున్నాడనే విషయాన్ని తెలియజేశాడు. మరి మొత్తానికైతే ఆయన చేయబోతున్న ఈ సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అనే విషయాన్ని పక్కన పెడితే అభిమానులకు ఏం కావాలో దాన్ని ఇవ్వడానికి బుచ్చిబాబు అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక బుచ్చి బాబు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక సుకుమార్ శిష్యుడుగా ఇండస్ట్రీకి వచ్చినప్పటికి ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోవాలనే ఉద్దేశ్యంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Also Read : ‘పెద్ది’ సినిమా లో బాలయ్య బాబు నటిస్తున్నాడా..?
పాటల విషయం పక్కనపెడితే ఈ సినిమాకు బిజియం విషయం లో ఆయన న్యాయం చేయలేడు అంటూ మొదటి నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఎందుకు అంటే ఏ ఆర్ రెహమాన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికి ఆయన సాఫ్ట్ మ్యూజిక్ మాత్రమే ఇస్తాడు. ఒక మాస్ సినిమాకి మాస్ బిజీయం ఇచ్చే కెపాసిటీ ఏఆర్ రెహమాన్ కైతే లేదు.
పెద్ది గ్లింప్స్ లో కూడా అంత పెద్దగా మాస్ బీజీయం అయితే ఇవ్వలేకపోయాడు. ఈయన ప్లేస్ లో అనిరుధ్ గాని, సంతోష్ నారాయణన్ గాని ఉంటే బిజిఎం అదిరిపోయేలా ఉండేది అంటూ మరి కొంతమంది మెగా ఫ్యాన్స్ సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇది సినిమాకు కొంతవరకు మైనస్ గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో బుచ్చిబాబు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. రామ్ చరణ్ చేస్తున్న ఈ సినిమా ఆయన కెరియర్ కి ఎలా ఉపయోగపడుతుంది. తద్వారా ఆడియన్స్ లో ఈ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుంది అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…
Also Read : ‘పెద్ది’ మూవీ పూర్తి స్టోరీ ఇదే..సరిగ్గా తీస్తే ‘దంగల్’ ని మించిన సినిమా అవుద్ది!