Peddi : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికి రానటువంటి ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకున్న నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)…తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు తన నటనను మెచ్చుకునే విధంగా సినిమాలను ఎంచుకుంటూ మంచి నటుడిగా గుర్తింపును సంపాదించుకుంటు ముందుకు సాగుతున్నాడు… అందుకే రామ్ చరణ్ కి ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు చిరంజీవి(Chiranjeevi)…ఆయన తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ చాలా తక్కువ సమయంలోనే మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. ఇక ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఈ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గేమ్ చేంజర్’ (Game Changer) సినిమాతో భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్న రామ్ చరణ్..ఈ సినిమాతో మాత్రం భారీ విజయాన్ని సాధిస్తాననే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచేసింది.
Also Read : ‘పెద్ది’ టీజర్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ టీం..పోస్టర్ అదుర్స్!
ఈనెల 6 వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ అయితే రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరి ఈ టీజర్ లో రామ్ చరణ్ యొక్క క్యారెక్టరైజేషన్ ఏంటి ఈ సినిమా థీమ్ ఏంటి దర్శకుడు ఈ మూవీ ద్వారా మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనే పాయింట్స్ ని సైతం ఎలివేట్ చేస్తూ టీజర్ కట్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది.
గత కొన్ని రోజుల క్రితం ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన రవిశంకర్ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా టీజర్ లో వచ్చే ఒక షాట్ అయితే అద్భుతంగా ఉంటుందని తెలియజేశాడు. మరి ఆ షాట్ కూడా రామ్ చరణ్ బాడీని ఎలివేట్ చేస్తూ ఒక డిఫరెంట్ షాట్ ని కంపోజ్ చేశారట. ఆ షాట్ డిఫరెంట్ గా చాలా బాగుందని ప్రతి ప్రేక్షకుడు కూడా ఫీలవుతాడు అంటూ సినిమా యూనిట్ నుంచి కొంత సమాచారం అయితే అందుతుంది.
మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాతో రామ్ చరణ్ పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడా..? రంగస్థలం సినిమాలో ఎంతటి ఇంపాక్ట్ ను అయితే క్రియేట్ చేశాడో ఈ సినిమాలో మరోసారి అలాంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాడా లేదా అనేది తెలియదంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…
Also Read : శ్రీ రామనవమి కి ‘పెద్ది’ టీజర్..పవర్ ఫుల్ డైలాగ్స్ లీక్!