spot_img
Homeఎంటర్టైన్మెంట్Peddi Movie Latest Update: మరోసారి క్లారిటీ కోల్పోయిన 'పెద్ది' టీం..ఫ్యాన్స్ ని గందరగోళంలోకి నెట్టిన...

Peddi Movie Latest Update: మరోసారి క్లారిటీ కోల్పోయిన ‘పెద్ది’ టీం..ఫ్యాన్స్ ని గందరగోళంలోకి నెట్టిన లేటెస్ట్ పోస్టర్..

Peddi Movie Latest Update: రిలీజ్ డేట్ విషయం లో ‘పెద్ది'(Peddi Movie) మేకర్స్ నిజం గానే అభిమానులతో ఒక ఆట ఆడుకుంటున్నారు. మార్చి 27 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమాని , షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో ఏప్రిల్ 30 కి వాయిదా వేశారు. ఇప్పుడు ఆ తేదీన కూడా రావడం లేదని గత కొంతకాలంగా సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. జూన్ లో విడుదల అవుతుందని కొందరు, జులై లో విడుదల అవుతుందని కొందరు, ఈ రెండు కాకుండా ఆగస్టు 13 న విడుదల అవుతుందని మరికొందరు, ఇలా ఎవరికీ తోచినట్టు వాళ్ళు సోషల్ మీడియా లో ప్రచారం చేయగా, ఇవి చూసి అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే నిన్న ‘రాకాస ‘ టీం తో కాసేపు ముచ్చటించిన రామ్ చరణ్, ‘పెద్ది’ సినిమా ఆలస్యం అవ్వడం లేదని, చెప్పిన డేట్ లోనే విడుదల అవుతుందని, కాస్త ఈ విషయాన్నీ జనాల్లోకి తీసుకెళ్లామని చెప్పాడు.

Also Read: 27 కోట్లు పెట్టి కొంటే.. నిండా ముంచాడు.. పాపం ఆయన కష్టం పగవాడికి కూడా రావద్దు

దీంతో ‘పెద్ది’ ఎట్టి పరిస్థితిలోనూ ఏప్రిల్ 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ మరోసారి నిన్న సాయంత్రం బలమైన ప్రచారం జరిగింది. కానీ నేడు హనుమాన్ జయంతి సందర్భంగా మూవీ టీం ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేశారు. రామ్ చరణ్ పెహిల్వాన్ గెటప్ లో చేతిలో గద పట్టుకొని స్టైల్ గా నిలబడి ఉన్నాడు. అయితే ఈ పోస్టర్ పై విడుదల తేదీ లేకపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. నిన్న రామ్ చరణ్ చూస్తే అలా చెప్పాడు , కానీ ఇప్పుడు మేకర్స్ ఏకంగా విడుదల తేదీనే పోస్టర్ నుండి లేపేశారు, అసలు ఏమి జరుగుతోంది?, పెద్ది చెప్పిన డేట్ కి వస్తుందా లేదా అని అభిమానులు సోషల్ మీడియా లో వీరంగం సృష్టించేస్తున్నారు.

అయితే ఏప్రిల్ 8 లోపు ఈ సినిమా విడుదల తేదీ పై స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బుచ్చి బాబు గురువు సుకుమార్ కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేయమని సూచించాడట. ఈ విషయం రామ్ చరణ్ కి ఇంకా తెలియదు. ఆయన రీ షూటింగ్ కి డేట్స్ ఇవ్వడానికి అంగీతారం తెలిపితే ఈ చిత్రం కచ్చితంగా జూన్ నెలకు వాయిదా పడుతుంది , ఒకవేళ ఒప్పుకోకుంటే ఏప్రిల్ 30 న విడుదల అవుతోంది. నిర్ణయం ఇప్పుడు కేవలం రామ్ చరణ్ మీదనే ఆధారపడుంది. రేపటి నుండి ఈ సినిమాకు సంబంధించిన ఐటెం సాంగ్ ని చిత్రీకరించబోతున్నట్టు టాక్. ఈ ఐటెం సాంగ్ లో రామ్ చరణ్ , జాన్వీ కపూర్ లతో కలిసి మృణాల్ ఠాకూర్ చిందులు వేయనుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular