Buchi Babu Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ఆశలు మొత్తం ఇప్పుడు ‘పెద్ది'(Peddi Movie) చిత్రం మీదనే ఉన్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి ‘గేమ్ చేంజర్’ చిత్రం తో ప్రేక్షకుల ముందుకొచ్చిన రామ్ చరణ్, ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకున్నాడు. #RRR తర్వాత భారీ గ్యాప్ తో విడుదలైన ఈ సినిమా కచ్చితంగా ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొడుతుందని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలు మొత్తం ఆవిరి అయ్యాయి. దీంతో సోషల్ మీడియా లో రామ్ చరణ్ ఫ్యాన్స్ బాధ తో అజ్ఞాతం లోకి వెళ్లారు. కానీ వాళ్ళను అజ్ఞాతం నుండి బయటకు తీసుకొచ్చిన చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైనప్పుడు ఇండియా మొత్తం షేక్ అయ్యింది. ముఖ్యంగా ఈ టీజర్ లోని పెద్ది షాట్ వేరే లెవెల్ లో వైరల్ అయ్యింది.
Also Read: 2026 లో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్న మెగాస్టార్..చరిత్రలో ఇదే తొలిసారి!
ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా IPL సమయం లో ఈ షాట్ ని ఆడుతూ కెమెరాలకు ఫోజులు ఇచ్చారు. అంతే కాదు ఇన్ స్టాగ్రామ్ లో నెటిజెన్స్ వేల సంఖ్యలో రీల్స్ కూడా చేశారు. అలా సినిమా విడుదలకు ముందే నేషనల్ లెవెల్ ఒక టీజర్ ని ఆడియన్స్ ఇంతలా అనుకరించడం ‘పెద్ది’ చిత్రం విషయం లో మాత్రమే జరిగింది. డైరెక్టర్ బుచ్చి బాబు కచ్చితంగా రామ్ చరణ్ నుండి రంగస్థలం కి మించిన పెర్ఫార్మన్స్ ని రాబట్టుకుంటాడని, తెలుగు లో మాత్రమే కాకుండా, హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొట్టి వెయ్యి కోట్ల మార్కు ని అందుకుంటుందని అభిమానులు చాలా బలమైన నమ్మకం తో ఉన్నారు. మరి ఆ నమ్మకం ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. ఇకపోతే మూవీ సరికొత్త షెడ్యూల్ కోసం రీసెంట్ గానే శ్రీలంక కి ప్రయాణం అయ్యారు.
అక్కడ రామ్ చరణ్ పై ఒక భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నట్టు టాక్. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు చూడని భారీ యాక్షన్ సీక్వెన్స్ అట అది. రామ్ చరణ్ అభిమానులకు మాత్రమే కాదు, ఆడియన్స్ కి కూడా పూనకాలు రప్పించే విధంగా ఈ సీక్వెన్స్ ఉంటుందట. ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాలో చాలానే ఉన్నాయని టాక్. కేవలం యాక్షన్ సన్నివేశాలు మాత్రమే కాదు AR రెహమాన్ అందించిన పాటలు కూడా చాలా అద్భుతంగా వచ్చాయని టాక్. రీసెంట్ గానే కొండలోయల్లో ఒక చెట్టు కొమ్మ పై నిల్చొని రామ్ చరణ్ డ్యాన్స్ వేస్తున్న వీడియో ఎంత వైరల్ అయ్యిందో మనమంతా చూసాము. అందులో వచ్చిన మ్యూజిక్ చాలా వినసొంపుగా అనిపించింది. నవంబర్ లో మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేస్తారట. చూడాలి మరి ఆ పాట ఏ రేంజ్ లో క్లిక్ అవుతుంది అనేది.