Rajamouli Comments On Keeravani: ప్రతీ హీరో కి రాజమౌళి(SS Rajamouli) లాంటి డైరెక్టర్ తో పని చెయ్యాలని ఉంటుంది. ఆయనతో సినిమా అంటే ఆషామాషీ విషయం కాదు, కనీసం రెండు మూడేళ్లు డేట్స్ ఇవ్వాలి, ఈ గ్యాప్ లో ఏ హీరో అయినా నాలుగైదు సినిమాలు చేసి భారీ రెమ్యూనరేషన్స్ తీసుకోవచ్చు. అయినప్పటికీ కూడా రాజమౌళి తో చేయడానికే మొగ్గు చూపిస్తారు. ఎందుకంటే ఆయన సినిమా హిట్ అయితే అద్భుతాలు జరుగుతాయి. అందులో నటించే హీరోకు తిరుగులేని ఇమేజ్ వస్తుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి వారు స్టార్స్ అయ్యిందే రాజమౌళి వల్ల. ఇప్పుడు అలాంటి రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) తో ఒక చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం మొదలైన ఈ సినిమా 25 శాతం కి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ కాంబినేషన్ ఇప్పుడు సెట్ అయినది కాదు. 12 ఏళ్ళ క్రితమే సెట్ అయ్యింది.
Also Read: 2026 లో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్న మెగాస్టార్..చరిత్రలో ఇదే తొలిసారి!
సౌత్ లో అందరూ స్టార్ డైరెక్టర్స్ మహేష్ తో పని చెయ్యాలని అనుకుంటారు, కానీ మహేష్ బాబు మాత్రం రాజమౌళి దర్శకత్వం లో నటించాలని చాలా కోరుకునేవాడు. అలా పదేళ్ల క్రితం సెట్ అయిన ఈ కాంబినేషన్ అనేక కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు రాజమౌళి కి #RRR తో గ్లోబల్ ఇమేజ్ వచ్చిన తర్వాత సెట్ అయ్యింది. తనకు గ్లోబల్ రేంజ్ లో మార్కెట్ ఓపెన్ అయ్యింది అని తెలుసుకున్న తర్వాత రాజమౌళి ఎందుకు సైలెంట్ గా ఉంటాడు ?, మహేష్ తో చేస్తున్న చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లోనే తెరకెక్కించాలని అనుకుంటాడు, ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఈ సినిమా తో ఆయన టార్గెట్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కాదు, హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్. 120 కి పైగా దేశాల్లో ఒకేసారి విడుదల కాబోతుంది ఈ చిత్రం.
అయితే ఈ సినిమా ప్రారంభం కాకముందు 2010 వ సంవత్సరం లో ఒక అభిమాని కి ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఒక అభిమాని ప్రశ్న అడుగుతూ ‘మీరు మహేష్ బాబు తో చేయబోయే సినిమాకు కీరవాణి ని కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని పెట్టుకోవచ్చు కదా’ అని అడుగుతాడు. దానికి రాజమౌళి సమాధానం చెప్తూ ‘అలాంటి పరిస్థితే వస్తే మహేష్ బాబు తో సినిమా చేయడం మానుకుంటాను కానీ, కీరవాణి ని మాత్రం వదలను. కీరవాణి లేకుండా ఈ రాజమౌళి సినిమా అంటే, చేతులు వెనక్కి కట్టుకొని యుద్దానికి వెళ్ళినట్టే’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ట్వీట్ ని ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పైకి లేపి మహేష్ బాబు ని ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్వీట్ ని మీరు క్రింద చూడొచ్చు.
@manidhar33 I wud forgo de chance of wrkng wid mahesh rather than leaving MMK out. It’s lyk going 2 battle wid my hands tied back
— rajamouli ss (@ssrajamouli) May 18, 2010