Irumudi: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్నటువంటి మాస్ మహారాజ రవితేజ నుండి ఒక భారీ బ్లాక్ బస్టర్ ని ఆశిస్తున్నారు ఆడియన్స్. సరిగ్గా అలాంటి సమయం లోనే ఆయన నుండి ‘ఇరుముడి’ అనే చిత్రం రాబోతుందని అధికారిక ప్రకటన చేశారు. అప్పటి నుండి ఈ సినిమాపై ఏర్పడిన పాజిటివ్ వైబ్స్ మామూలైవి కావు. కచ్చితంగా ఈ సినిమాతో రవితేజ భారీ కం బ్యాక్ ఇవ్వబోతున్నారని అర్థం అయిపోయింది. ఆ పాజిటివ్ వైబ్స్ కి తగ్గట్టుగానే ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ వీడియోలకు ఆడియన్స్ , ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక నేడు ఈ చిత్రం నుండి ‘ఇరుముడి కట్టు’ అనే పాట విడుదల అవ్వగా, దీనికి కూడా ఆడియన్స్ బ్లాస్టింగ్ రెస్పాన్స్ వచ్చింది. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ అంచనాలను అందుకోవడం లో సక్సెస్ అయ్యారు.
ఈ పాటలో రవితేజ డ్యాన్స్ స్టెప్పులు చాలా హోమ్లీ గా, సింపుల్ గా ఉన్నాయి. అలా డిజైన్ చేశారు కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ మాస్టర్. సాంగ్ మొత్తం మంచి వైబ్ తో ఉంది. పాటలో మొదటి 3 నిమిషాలు ఒక ఎత్తు అయితే , చివరి నిమిషం మరో ఎత్తు. థియేటర్స్ లో అభిమానులు , ప్రేక్షకులు కచ్చితంగా పూనకాలొచ్చి ఊగిపోతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి వైబ్ ఈ పాటలో ఉంది. సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న ఈ పాటని మీకోసం క్రింద అందిస్తున్నాం చూడండి. ఎంతో ఎనర్జీ యాక్టింగ్ తో , మాస్ ఫైట్స్ , మాస్ ఎలివేషన్స్ తో ఇన్నాళ్లు రవితేజ కెరీర్ సాగింది. అలాంటి హీరో తో ఇలాంటి రోల్ వేయించాలనే ఆలోచన రావడం లోనే డైరెక్టర్ శివ నిర్వాణ సక్సెస్ అయ్యారు.
పర్ఫెక్ట్ గా తీస్తే మాత్రం ఈ సినిమా తో రవితేజ పాన్ ఇండియా లెవెల్ లో రీ సౌండ్ వచ్చే రేంజ్ లో బ్లాక్ బస్టర్ కొట్టొచ్చు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా , ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 21 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ సినిమాతో అందరూ కోరుకునే విధంగా రవితేజ భారీ బ్లాక్ బస్టర్ ని అందుకుంటాడో లేదో చూడాలి.
