Homeఎంటర్టైన్మెంట్Peddi 15th Day Collections: కొత్త సన్నివేశాలు జత చేసినప్పటికీ పెరగని 'పెద్ది' వసూళ్లు.. 15వ...

Peddi 15th Day Collections: కొత్త సన్నివేశాలు జత చేసినప్పటికీ పెరగని ‘పెద్ది’ వసూళ్లు.. 15వ రోజు వచ్చిన గ్రాస్ ఎంతంటే..

Peddi 15th Day Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని , బలమైన థియేట్రికల్ రన్ లో రీసెంట్ గానే 300 కోట్ల గ్రాస్ మార్కుని కూడా దాటి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మేకర్స్ ఈ చిత్రానికి 400 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు కానీ, ఆ రేంజ్ వసూళ్లు అసలు రాలేదని , వాస్తవానికి ఇప్పటి వరకు 330 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే ఈ సినిమా డ్రీం రన్ ఈ వీకెండ్ తో ముగిసిపోయేట్టుగా అనిపిస్తోంది అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే 11 రోజుల తర్వాత వసూళ్లు బాగా డౌన్ అయిపోయాయి.

14 వ రోజున ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 88 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, 15 వ రోజున 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక నేడు సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం భారీ అంచనాల నడుమ థియేటర్స్ లో విడుదలైంది. ఈ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది , ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. దీంతో ‘పెద్ది’ థియేటర్స్ కూడా బాగా తగ్గాయి. ఆ కారణం చేత నేడు కనీసం 50 లక్షల షేర్ వసూళ్లు అయినా వస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గడిచిన రెండు వారాల్లో ‘పెద్ది’ చిత్రానికి పోటీగా ఒక్క సినిమా కూడా లేకపోవడంతో , ఆ రేంజ్ థియేట్రికల్ రన్ వచ్చిందని , ఇప్పుడు పోటీ ఉండడం తో బాగా డౌన్ అయ్యిందని అంటున్నారు.

కలెక్షన్స్ డౌన్ అవుతున్నాయి అనే విషయాన్ని గ్రహించిన నిర్మాతలు , నిన్నటి నుండి థియేటర్స్ లో కొత్త సన్నివేశాలు జత చేసిన సరికొత్త వెర్షన్ ని థియేటర్స్ లో రీ లోడ్ చేశారు. ఈ కొత్త సన్నివేశాల కారణంగా కచ్చితంగా కలెక్షన్స్ పెరుగుతాయని అనుకున్నారు. కానీ నిర్మాతల అంచనాలు తప్పాయి , ముందు రోజు తో పోలిస్తే కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి కానీ , ఎలాంటి పెరుగుదల లేదు. కనీసం వీకెండ్ లో అయినా ఈ సరికొత్త సన్నివేశాల ప్రభావం కలెక్షన్స్ పైన కనిపిస్తుందా లేదా అనేది చూడాలి. ఇక పోతే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 144 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు , 220 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాగ, వరల్డ్ వైడ్ గా 196 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 331 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular