Peddhi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) అభిమానులు ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) ఫలితం తో తీవ్రమైన నిరాశలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా లో ఎంతో చురుగ్గా ఉండే రామ్ చరణ్ ఫ్యాన్స్, ఈ సినిమా విడుదల తర్వాత చాలా సైలెంట్ అయిపోయారు. కొన్ని రోజులు అజ్ఞాతం లోకి వెళ్లే ఉద్దేశ్యంతో అనేక మంది తమ ఆన్లైన్ ట్విట్టర్ అకౌంట్స్ ని డీ యాక్టీవ్ చేసుకొని వెళ్లారు. ఆ రేంజ్ లో నిరాశపరిచింది ఆ చిత్రం. అయితే ఎప్పుడైతే ‘పెద్ది'(Peddi Movie) మూవీ ఫస్ట్ లుక్ విడుదలైందో, అప్పటి నుండి అభిమానుల్లో కొత్త జోష్ వచ్చింది. రామ్ చరణ్ కం బ్యాక్ ఈసారి మామూలు రేంజ్ లో ఉండదని సంతోషించారు. శ్రీ రామ నవమి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మొదటి టీజర్ ని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు మేకర్స్. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా ఇటీవలే జరిగింది.
Also Read : రామ్ చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ వచ్చేది అప్పుడే…ప్రొడ్యూసర్స్ మాటలు నిజం అవుతాయా..?
అయితే గేమ్ చేంజర్ చిత్రం డిజాస్టర్ అయినప్పటికీ రామ్ చరణ్ పై ఇసుమంత కూడా ప్రభావం చూపించలేకపోయిందని ‘పెద్ది’ మూవీ కి జరుగుతున్న బిజినెస్ ని చూసి చెప్పొచ్చు. షూటింగ్ మొదలై మూడు షెడ్యూల్స్ కూడా పూర్తి కాలేదు, అప్పుడే ఓటీటీ రైట్స్ నెట్ ఫ్లిక్స్(Netflix) సంస్థకు 135 కోట్ల రూపాయలకు అమ్మేసారు నిర్మాతలు. ఇప్పుడు ఆడియో రైట్స్ ని టీ సిరీస్(T Series) సంస్థకు అమ్మారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నిన్న సాయంత్రం మూవీ టీం అధికారికంగా చేసింది. AR రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్న ఈ ఆడియో దాదాపుగా 35 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది టాక్. టాలీవుడ్ లో ఇది ఆల్ టైం టాప్ 2 రికార్డు అని చెప్పొచ్చు. మొదటి స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2 ‘ చిత్రం ఉంది. దాదాపుగా 60 కోట్ల రూపాయిల వరకు ఆ సినిమా ఆడియో రైట్స్ అమ్ముడుపోయింది.
ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించబోతున్నాడు. ఇందులో రామ్ చరణ్ గ్రామీణ ప్రాంతంలో ఉండే అద్భుతమైన ప్రతిభ గల ఆటగాడిగా కనిపించనున్నాడు. కేవలం క్రికెట్ లో మాత్రమే కాకుండా, కబడ్డీ, కుస్తీ, మరియు ఇతర క్రీడల్లో కూడా అద్భుతమైన ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి తన గుర్తింపు కోసం చేసే పోరాటమే పెద్ది చిత్రం. టీజర్ కట్ అద్భుతంగా కుదిరిందట. ఈ టీజర్ లో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర మాండలికం లో డైలాగ్స్ కొట్టనున్నాడు. రంగస్థలం టీజర్ ని చూసినప్పుడు ప్రతీ ఒక్కరికి ఎలా అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగాయో, ఈ సినిమా టీజర్ కి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు. వచ్చే ఏడాది మార్చి 26 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : ‘పెద్ది’ చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ వదిలేసుకోవడానికి కారణం ఇదేనా?