https://oktelugu.com/

బాలయ్యా.. హీరోయిన్ల పై ఇష్టాన్ని మానుకో !

బాల‌కృష్ణ కొత్త సినిమా విష‌యంలో ఎప్పుడూ అర‌డ‌జ‌ను మంది హీరోయిన్ల పేర్లు వినిపిస్తాయి. అదేంటో చివరికీ వాళ్లల్లో ఒక్కరు కూడా బాలయ్య సినిమాలో కనిపించరు. ఆ మాటకొస్తే అరవై దాటిన హీరోలు చాలా మందే ఉన్నా.. హీరోయిన్ల బాధ ఒక్క బాలయ్యకే అందరి కంటే ఎక్కువ. ఎందుకయ్యా అంటే బాలయ్య బాబు పక్కన చేస్తే.. ఇక ఆ హీరోయిన్ షెడ్ కి వెళ్లడమే అనే టాక్ ఉంది. అందుకే ద‌క్షిణాది మొత్తం గాలించినా బాలయ్యకు హీరోయిన్ కొర‌త […]

Written By:
  • admin
  • , Updated On : August 4, 2020 / 05:28 PM IST
    Follow us on


    బాల‌కృష్ణ కొత్త సినిమా విష‌యంలో ఎప్పుడూ అర‌డ‌జ‌ను మంది హీరోయిన్ల పేర్లు వినిపిస్తాయి. అదేంటో చివరికీ వాళ్లల్లో ఒక్కరు కూడా బాలయ్య సినిమాలో కనిపించరు. ఆ మాటకొస్తే అరవై దాటిన హీరోలు చాలా మందే ఉన్నా.. హీరోయిన్ల బాధ ఒక్క బాలయ్యకే అందరి కంటే ఎక్కువ. ఎందుకయ్యా అంటే బాలయ్య బాబు పక్కన చేస్తే.. ఇక ఆ హీరోయిన్ షెడ్ కి వెళ్లడమే అనే టాక్ ఉంది. అందుకే ద‌క్షిణాది మొత్తం గాలించినా బాలయ్యకు హీరోయిన్ కొర‌త తీరదు. నిజంగా బాలయ్యకి ఇది ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితే.. లేకపోతే ఒకప్పుడు టాప్ హీరోల్లో ఒకడిగా వెలిగిపోయిన బాలయ్య బాబుకి హీరోయిన్ దొరకపోవడం ఏమిటి ?

    Also Read: చెర్రీ, పూరీ రెండోసారి..

    పోనీ గతంలో తనతో నటించిన హీరోయిన్ల‌ను రిపీట్ చేద్దామా అంటే.. ప్లాప్ కాంబినేషన్ అవుతుంది. సరే అని తనకు ఉన్న రెండు మూడు హిట్ సినిమాల్లోని హీరోయిన్ తీసుకుందామా అంటే నయనతార, రాధికా ఆప్టే తప్ప మరో హీరోయిన్ లేకపాయే. రాధికా ఆప్టే పై న్యూడ్ ఇమేజ్ పడి బి గ్రేడ్ హీరోయిన్ అయిపొయింది. కాస్త కష్టమే అయినా నయనతారను పట్టుకుందామా అంటే సూపర్ స్టార్ సినిమాలకే నయనతార హ్యాండ్ ఇస్తోంది, ఇక బాలయ్య సినిమాకి ఎందుకు ఒప్పుకుంటుంది. ఎలాగోలా కొత్త వారితోనే చేద్దామంటే.. బాల‌కృష్ణ‌ పక్కన వాళ్ళు కూతురులాగా అనిపిస్తున్నారు. పైగా బాల‌కృష్ణ‌ పక్కన వారిని జోడీగా ఊహించుకోవ‌డానికి కూడా భయం వేస్తోందాయే.

    Also Read:  సుక్కు పైత్యం.. బాధలో బన్నీ !

    ఏది ఏమైనా బాలయ్యకు ఈ హీరోయిన్లు స‌మ‌స్య‌ తీరాలంటే.. బాలయ్య కుర్ర హీరోల పాత్రలు వేయడం మానుకోవాలి. లేదంటే.. బాల‌కృష్ణ‌కు ఈ హీరోయిన్ల ఇబ్బంది ఇంకా కొన‌సాగుతూనే ఉంటుంది. దీనికి తోడు బాలయ్య బాబుకు ఒక్క హీరోయిన్ సరిపోదు. కనీసం ఇద్దరైనా ఉండాలి. కుదిరితే ముగ్గురు ఉన్నా హ్యాపీనే. మరి అంత మంది హీరోయిన్లు తమ కెరీర్ ను రిస్క్ లో పెట్టి బాలయ్య సినిమాలో చేయడానికి వస్తారనుకోవడం అపోహే. అయినా అరవై దాటిన హీరోలు అందరూ కథల విష‌యంలో హీరోయిన్ల విషయంలో త‌మ అభిరుచులను మార్చేసుకోవడం ఉత్తమం. ఇంకా గ్లామ‌రస్ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తే.. ఫ్యాన్స్ కి కూడా అసహ్యం వేస్తోంది. కాబట్టి బాలయ్య అండ్ సీనియర్లూ హీరోయిన్ల పై ఇష్టాన్ని మానుకోండి.