Payal Rajput
Payal Rajput : ఒక హీరోయిన్ సినీ ఇండస్ట్రీ లో సక్సెస్ అవ్వాలంటే చూపులు తిప్పుకోలేనంత అందమైన ఉండాలి, లేకపోతే అద్భుతమైన టాలెంట్ అయినా ఉండాలి. ఈ రెండిట్లో ఏది ఉన్నా లేకపోయినా అదృష్టం మాత్రం కచ్చితంగా ఉండాలి. అందం, టాలెంట్ రెండు ఉన్నప్పటికీ అదృష్టం లేక ఆశించిన స్థాయిలో సక్సెస్ లు చూడని హీరోయిన్లు మన ఇండస్ట్రీ లో చాలా మంది ఉన్నారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు పాయల్ రాజ్ పుత్(Payal Rajput). హిందీ లో పలు సూపర్ హిట్ సీరియల్స్ ద్వారా మంచి ఫేమ్ ని దక్కించుకున్న పాయల్ రాజ్ పుత్ ‘RX 100’ చిత్రం ద్వారా మన తెలుగు ఆడియన్స్ కి పరిచయమైంది. ఈ సినిమాలో విలన్ క్యారక్టర్ లో అద్భుతంగా నటించి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. కానీ తొలిసినిమాలోనే నెగటివ్ రోల్ చేయడం పాయల్ రాజ్ పుత్ కెరీర్ పై ప్రభావం చూపించిందా అని విశ్లేషకులు అనుకుంటున్నారు.
Also Read : పెళ్లి పీటలు ఎక్కనున్న పాయల్ రాజ్ పుత్… ఆర్ఎక్స్ 100 భామను పెళ్లాడనున్న ఆ లక్కీ ఫెలో ఎవరో తెలుసా?
ఈ చిత్రం తర్వాత ఆమెకు అన్నీ అలాంటి తరహా పాత్రలే వచ్చాయట. కొన్ని ఒప్పుకొని చేసింది కానీ, కొన్ని మాత్రం ఒప్పుకోలేదు. మిగిలిన హీరోయిన్స్ కి లాగా ఈమెకు రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ రోల్స్ ఇచ్చే డైరెక్టర్ కానీ, నిర్మాత కానీ లేరు. ఇది మామూలు దురదృష్టం కాదనే చెప్పాలి. ఆమెకు వస్తే ‘మంగళవారం’ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వస్తున్నాయి, లేకపోతే ఖాళీ గానే ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి. ‘మంగళవారం’ లో ఈమె ఎంత అద్భుతంగా నటించిందో మనమంతా చూసాము. ఇలాంటి టాలెంట్ ఉన్న హీరోయిన్స్ ని మన ఇండస్ట్రీ ఎందుకు ప్రోత్సహించడం లేదు, ఇలాంటోళ్ళతో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేయొచ్చు, కానీ డైరెక్టర్స్ ఇలాంటి టాలెంటెడ్ హీరోయిన్స్ ని పట్టించుకోవడం లేదు. ఏడాదికి ఇద్దరు ముగ్గురు కొత్త హీరోయిన్స్ ని దింపి, వాళ్ళ చేత పనికిమాలిన హుక్ స్టెప్పులు క్రియేట్ చేసి డబ్బులు పోగు చేసుకుంటున్నారు.
సినిమాల్లో అవకాశాలు లేకపోవడం తో, పాయల్ రాజ్ పుత్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ కాలాన్ని ముందుకు సాగిస్తుంది. కనీసం ఇలాంటి ఫోటోలు చూసి అయినా ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఇస్తారేమో అనే చిన్న ఆశతో ఇలా చేస్తుండొచ్చు. రీసెంట్ గా ఆమె టవల్ ని చుట్టుకొని ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫోటోని అప్లోడ్ చేసింది, అది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. నెటిజెన్స్ ఆ ఫోటో కింద ఇంత అందమైన అమ్మాయికి ఇప్పటికైనా అవకాశాలు ఇవ్వన్దిరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ చేతిలో రెండు తమిళ సినిమాలు, ఒక తెలుగు సినిమా ఉంది. వీటిలో ఏ ఒక్క సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయినా ఆమెకు అవకాశాలు రావొచ్చేమో చూద్దాం.
Also Read : పాయల్ అందాల అరాచకం.. పోస్ట్ పెడితే పూనకాలే..