Sagar K Chandra: పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ ఏంటో బాక్సాఫీస్ వద్ద “భీమ్లా నాయక్” ద్వారా మరోసారి ఘనంగా రుజువు అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ.. పవన్ కళ్యాణ్ కొత్త రికార్డులను సెట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాతో తానూ బాక్సాఫీస్ కింగ్ ను అని పవన్ నిరూపించారు. మొత్తమ్మీద సక్సెస్ ఫుల్ టాక్ తో పవన్ కళ్యాణ్, రానాల ‘భీమ్లానాయక్’ మూవీ దూసుకెళ్తోంది.

కాగా భీమ్లా నాయక్ మలయాళ రీమేక్ అయినప్పటికీ ఈ మూవీని చూసి వారు మళ్లీ దీనిని రీమేక్ చేసేలా మార్పులు చేశామని దర్శకుడు సాగర్ కె చంద్ర చెప్పాడు. ‘సినిమాను బాగా తీయ్.. బాధ్యతగా పనిచెయ్’ అన్న పవన్‌కళ్యాణ్ మాటలను మనసులో పెట్టుకుని ఎనర్జీతో పనిచేశామని తెలిపాడు. సినిమా విషయంలో త్రివిక్రమ్ ఇచ్చిన సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయని పేర్కొన్నాడు.
Also Read: రామ్ కి విలన్ అతనే.. ఈ సారైనా కాలం కలిసొస్తుందా
పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా సాగర్ ను అందరూ ఓన్ చేసుకుంటున్నారు. ఒక్క సినిమాతో సాగర్ కి అద్భుతమైన గుర్తింపు వచ్చింది. కాగా ప్రస్తుతం వసూళ్ల వరద పారిస్తున్న భీమ్లా నాయక్‌కి ఈ రోజు శ్రీమంతుడు పోటీ ఇవ్వనుంది. అదెలా అని ఆశ్చర్యపోకండి. ఈ రోజు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని, ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్, కొత్తపేట మొదలుకొని పలు బీసీ థియేటర్లలో శ్రీమంతుడు చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం వచ్చి చాలా కాలం అవడంతో, ఈ రోజు మహేష్ బాబు అభిమానులు శ్రీమంతుడుతో శివరాత్రి జాగారం చేయనున్నారు. అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ యమదొంగ సినిమాతో హంగామా చేయబోతున్నారు.
Also Read: సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు