Ram Lingusamy Movie: ఎనర్జిటిక్ స్టార్ గా రామ్ పోతినేనికి మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం రామ్ – దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది వారియర్’ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా నటించనున్నాడు. ఈ మూవీ ఫస్ట్‌లుక్ ను నేడు మధ్యాహ్నం 2 గంటల 22 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌గా రామ్ నటిస్తున్నాడు.

మొత్తానికి రామ్ సినిమాలో మరో యంగ్ హీరో కూడా జాయిన్ అయ్యాడు. అన్నట్టు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ చేస్తోన్న సినిమా ఓ పాన్ ఇండియా సినిమా. అందుకే రామ్ ఈ సినిమా కోసం మొదటి నుంచి బాగా కష్టపడుతున్నాడు. కెరీర్ లో మొదటిసారి చేస్తోన్న పాన్ ఇండియా సినిమా కాబట్టి.. తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం జిమ్ లో వ్యాయామం చేస్తూ గడుపుతున్నాడు.
Also Read: ‘పునీత్ రాజ్ కుమార్’కు నివాళి గా నింగిలోకి ఉపగ్రహం
పైగా గత కొంత కాలంగా రామ్ ఎనర్జిటిక్ స్టార్ గా తనను తాను బాగానే ప్రమోట్ చేసుకుంటున్నాడు. కానీ ఎందుకో స్టార్ హీరోగా చలామణి కాలేకపోయాడు. నిజానికి రామ్ కి స్టార్ హీరో అయ్యే అన్ని ఫీచర్స్ ఉన్నాయి. కానీ, రామ్ మాత్రం ఇంకా ఏవరేజ్ హీరో స్థాయికే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే, ఈ మధ్యలో ‘ఇస్మార్ట్ శంకర్’తో తన మార్కెట్ పరిధిని పెంచుకున్నాడు,

కానీ.. అంతలోనే రెడ్ అంటూ వచ్చిన హైప్ ను పోగొట్టుకుని.. ఆ స్టార్ డమ్ ను క్యాష్ చేసుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు సినిమాలు హిట్ అయితేనే మళ్ళీ స్టార్ రేసులోకి వెళ్తాడు. అయితే, తన కంటే వెనుక వచ్చిన విజయ్ దేవరకొండ లాంటి హీరోలు కూడా స్టార్ హీరోలుగా క్రేజ్ తెచ్చుకుంటుంటే.. తను మాత్రం ఇంకా మిడిల్ రేంజ్ హీరోగానే ఎందుకు ఉండాలి ? అనేది రామ్ ప్రస్తుత పాయింట్. అందుకే, తాను కూడా ఇక నుంచి విజయ్ దేవరకొండ రూట్ లోనే వెళ్లడానికి కసరత్తులు చేస్తున్నాడు.
విజయ్ దేవరకొండకు హైప్ రావడానికి ముఖ్య కారణాల్లో.. అతను చేస్తోన్న యాడ్స్ కూడా ఒక కారణం. అందుకే, రామ్ కూడా యాడ్స్ పై పట్టు బిగించాడు. దానికి సంబంధించిన ఒక ప్రత్యేక టీమ్ ను కూడా పెట్టుకున్నాడు. ఇక లింగుస్వామి సినిమా పూర్తి చేసిన వెంటనే.. బోయపాటి తో సినిమాని సెట్ చేసే పనిలో ఉన్నాడు రామ్,
Also Read: సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు