https://oktelugu.com/

Jani Master: జానీ మాస్టర్ కి మరో గట్టి షాక్ ఇచ్చిన పోలీసులు.. ఏం జరిగిందంటే?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ వద్ద గతంలో పని చేసి లేడీ అసిస్టెంట్ ఈ కేసు పెట్టారు. తాను మైనర్ గా ఉన్నప్పటి నుండే లైంగిక దాడి జరిగిందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

Written By:
  • S Reddy
  • , Updated On : October 7, 2024 / 11:25 AM IST

    Police to File Petition Seeking Cancellation of Jani Master Interim Bail

    Follow us on

    Jani Master: జానీ మాస్టర్ మళ్ళీ జైలుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనకు పోలీసులు మరో షాక్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు సమాచారం. ఇప్పటికే జానీ మాస్టర్ కి జాతీయ అవార్డ్ రద్దు చేశారు.

    ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ వద్ద గతంలో పని చేసి లేడీ అసిస్టెంట్ ఈ కేసు పెట్టారు. తాను మైనర్ గా ఉన్నప్పటి నుండే లైంగిక దాడి జరిగిందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదైంది. పరారీలో ఉన్న జానీ మాస్టర్ ని సెప్టెంబర్ 19న హైదరాబాద్ పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. ఉప్పర్ పల్లి కోర్టు జానీ మాస్టర్ కి 14 రోజులు రిమాండ్ విధించింది.

    కాగా జానీ మాస్టర్ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జాతీయ అవార్డు అందుకోవాల్సి ఉంది. అక్టోబర్ 8న ఢిల్లీలో జరిగే నేషనల్ అవార్డ్స్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి జానీ మాస్టర్ హాజరు కావాలి. అయితే మైనర్ బాలిక మీద లైంగిక దాడి చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో. నేషనల్ అవార్డు రద్దు చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ప్రభుత్వం జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు రద్దు చేసింది.

    కాగా జాతీయ అవార్డు కార్యక్రమానికి హాజరు కావాలన్న జానీ మాస్టర్ అభ్యర్థన మేరకు కోర్ట్ ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జాతీయ అవార్డ్ రద్దైన నేపథ్యంలో జానీ మాస్టర్ బెయిల్ కూడా రద్దు చేయాలని పోలీసులు కోరుతున్నారు. ఈ మేరకు రంగారెడ్డి కోర్టులో వారు పిటీషన్ వేయనున్నారని సమాచారం. మరి అదే జరిగితే జానీ మాస్టర్ మరోసారి రిమాండ్ కి వెళ్లాల్సి ఉంటుంది.

    మరోవైపు ఇది జానీ మాస్టర్ పై జరుగుతున్న కుట్రగా ఆయన భార్య అయేషా అభిప్రాయ పడుతున్నారు. ఈ క్రమంలో బాధితురాలిపై ఆమె కీలక ఆరోపణలు చేశారు. జానీ మాస్టర్ కేసు వివరాలు పరిశీలిస్తే… 2020లో అవుట్ డోర్ షూటింగ్ కోసం ముంబై తీసుకెళ్లిన జానీ మాస్టర్ తనపై హోటల్ లో మొదటిసారి లైంగిక దాడి చేశాడు. అప్పటికి నా వయసు 16 ఏళ్లు మాత్రమే. ఈ విషయం బయటకు చెపితే కెరీర్ లేకుండా చేస్తానని బెదిరించాడు .

    అప్పటి నుండి పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కారవాన్ లో కూడా బలవంతం చేసేవాడు. సహకరించకపోతే దాడి చేసేవాడు. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. జానీ మాస్టర్ అయేషా సైతం అతనికి సహకరించింది. ఆమె కూడా తనపై దాడి చేసిందని… లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో పేర్కొంది.