Homeఎంటర్టైన్మెంట్పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం.. ప్రచారానికి సన్నాహాలు !

పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం.. ప్రచారానికి సన్నాహాలు !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ప్రమోషన్స్ లలో బాగా వెనుకబడిందని ఇప్పటికే ఫ్యాన్స్ నుండి నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. వకీల్ సాబ్ టీమ్ లీడర్ ‘దిల్ రాజు’ పై పవన్ ఫ్యాన్స్ ఆల్ రెడీ రెడ్ అలెర్ట్ ను ప్రకటించారు. పైగా దిల్ రాజు వ్యవహారం ఈ మధ్య పెద్దగా ఏమి బాగాలేదని.. సినిమాల ప్రమోషన్స్ ను రాజుగారు అస్సలు పట్టించుకోవట్లేదని.. ఇలా అయితే, వకీల్ సాబ్ సినిమాకి బాగా నష్టం జరుగుతుందని దిల్ […]

Vakeel saab
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ప్రమోషన్స్ లలో బాగా వెనుకబడిందని ఇప్పటికే ఫ్యాన్స్ నుండి నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. వకీల్ సాబ్ టీమ్ లీడర్ ‘దిల్ రాజు’ పై పవన్ ఫ్యాన్స్ ఆల్ రెడీ రెడ్ అలెర్ట్ ను ప్రకటించారు. పైగా దిల్ రాజు వ్యవహారం ఈ మధ్య పెద్దగా ఏమి బాగాలేదని.. సినిమాల ప్రమోషన్స్ ను రాజుగారు అస్సలు పట్టించుకోవట్లేదని.. ఇలా అయితే, వకీల్ సాబ్ సినిమాకి బాగా నష్టం జరుగుతుందని దిల్ రాజు పై పవన్ టీమ్ ఒత్తిడి పెంచింది.

దాంతో దిల్ రాజు ఇక వరుసగా పబ్లిసిటీ క్యాంపెన్ మొదలుపెట్టాలని.. అందులో భాగంగానే ఈ సినిమా నుంచి మూడో పాట కూడా వదిలాడు ఆట. ‘కంటి పాప’ అనే ఈ సాంగ్ పవన్ కళ్యాణ్, శృతి హాసన్ ల మధ్య కెమిస్ట్రీ బాగా ఎలివేట్ చేస్తోంది. పైగా ఇది ఒక డ్యూయెట్ లా కాకుండా.. సినిమాలో మంచి లవ్ స్టోరీ కూడా ఉందని చాటి చెప్పినట్లు అయింది. ఇక రేపటి నుండి ఈ సినిమా కోసం వినూత్న ప్రచారాలను చేయబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కూడా ఖరారు చేశారు. ఏప్రిల్ 3న హైద్రాబాద్లో ఈ ఫంక్షన్ గ్రాండ్ గా జరగనుంది. ఇక ఫంక్షన్ లో గెస్టులు కూడా ఉంటారని తెలుస్తోంది. అన్నిటికి మించి మూడేళ్ళ లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి సినిమా కావడంతో.. ‘వకీల్ సాబ్’ కోసం ఫ్యాన్స్ కూడా బాగా ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో హిట్టయిన ‘పింక్’ సినిమాకి రీమేక్. తమన్ సంగీతం అందించాడు. చూడాలి ఈ సినిమాకి ఏ రేంజ్ హిట్ ను ఇస్తోందో.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper