https://oktelugu.com/

పవన్ బలం.. బలహీనత అభిమానులే..!

ప్లాపులు.. హిట్టులతో సంబంధం లేకుండా క్రేజ్ సంపాదించుకున్న హీరో పవన్ కల్యాణ్. ఆయన చేసేంది కేవలం 25 సినిమాలే అయినా ప్రపంచ వ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకున్నాడు. ఏ హీరోకు లేని ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పవర్ స్టార్ సొంతం. పవన్ ప్రస్తుతం సినిమాలతోపాటు రాజకీయాల్లోనూ బీజీగా మారారు. ప్రస్తుతం ప్రజా సమస్యలపై పోరాడుతూ పవర్ స్టార్ ప్రజలకు అండగా ఉంటున్నారు. అదేవిధంగా కొంచెం సమయాన్ని సినిమాలకు కేటాయించి తన అభిమానులను అలరించేందుకు మరోసారి రెడీ అవుతున్నాడు. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 2, 2020 / 11:27 AM IST
    Follow us on

    ప్లాపులు.. హిట్టులతో సంబంధం లేకుండా క్రేజ్ సంపాదించుకున్న హీరో పవన్ కల్యాణ్. ఆయన చేసేంది కేవలం 25 సినిమాలే అయినా ప్రపంచ వ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకున్నాడు. ఏ హీరోకు లేని ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పవర్ స్టార్ సొంతం. పవన్ ప్రస్తుతం సినిమాలతోపాటు రాజకీయాల్లోనూ బీజీగా మారారు. ప్రస్తుతం ప్రజా సమస్యలపై పోరాడుతూ పవర్ స్టార్ ప్రజలకు అండగా ఉంటున్నారు. అదేవిధంగా కొంచెం సమయాన్ని సినిమాలకు కేటాయించి తన అభిమానులను అలరించేందుకు మరోసారి రెడీ అవుతున్నాడు. అయితే పవన్ బలం.. బలహీనత అభిమానులే కావడం గమనార్హం.

     పవన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

    •  పవన్ కల్యాణ్ అసలు పేరు కొడిదెల కల్యాణ్ బాబు. అయితే కల్యాణ్ ఇంటర్మీయట్ అయిపోయాక మార్షల్ ఆర్ట్స్ పై మక్కువ పెంచుకున్నాడు. కల్యాణ్ శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే ఆయన గురువు కల్యాణ్ పేరు ముందు పవన్ పేరును చేర్చాడు. దీంతో కల్యాణ్ బాబు కాస్తా పవన్ కల్యాణ్ గా మారారు. సినీరంగంలో పవన్ కల్యాణ్ పేరే ఆయనకు బాగా కలిసొచ్చింది.
    •  పవన్ కల్యాణ్ కొన్నాళ్లపాటు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించాడు. కాగా పవన్ పూర్తి శాఖహరి. ఆయన నాన్ వెజ్ జోలికి వెళ్లడు.
    •  పవన్ కల్యాణ్ హీరో కంటే డైరెక్టర్ కావాలని ఆకాంక్షించాడు. అయితే చిరంజీవి భార్య సురేఖ ఒత్తిడితో పవన్ హీరోగా మారాడు. చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్లోకి ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు.
    • అయితే పవన్ కల్యాణ్ నటించిన నాలుగో చిత్రం ‘తొలిప్రేమ’ టాలీవుడ్లో సరికొత్త రికార్డులను సృష్టించింది. అమ్మాయికి తెలియకుండా ప్రేమించే యువకుడి(బాలు)గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. యువతకు బాలు పాత్ర బాగా కనెక్ట్ కావడంతో ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఈ మూవీకి జాతీయ అవార్డుతో పాటు ఆరు నంది అవార్డులు వచ్చాయి. పవర్ స్టార్ ఖుషీ.. గబ్బర్‌ సింగ్‌.. అత్తారింటికి దారేది సినిమాలతో టాలీవుడ్లో సరికొత్త రికార్డులు సృష్టించాడు.
    • సౌత్‌ ఇండియా నుంచి పెప్సీ యాడ్‌లో కనిపించిన తొలి హీరో పవన్‌ కళ్యాణే. ఆయనకు క్యూబా విప్లవ వీరుడు చెగువేరా ఇష్టం. ఆయన సినిమాల్లోనూ చెగువేరా ఫొటోలు తరుచూ కన్పిస్తుంటాయి. అభిమానులు సైతం పవర్ స్టార్ ను చెగువేరాతో పోలుస్తుంటారు. పవన్ కల్యాణ్ కు పబ్బులు, విదేశీ టూర్లకు నచ్చదు. ఖాళీ సమయం దొరికితే పుస్తకాలు చదువుతూనో.. లేదా తన ఫాం హౌస్‌లో వ్యవసాయం చేస్తూనే ఉంటారు.
    •  పవన్ మ్యారేజీ లైఫ్ కొంత ఒడిదుడుకులతో ఉన్నట్లు కన్పిస్తోంది. 1997లోనే పవన్ ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే వారిద్దరి మధ్య మనస్పర్థలు రావటంతో చాలాకాలం దూరంగా ఉండి 2007లో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత 2007లో రేణు దేశాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 2012లో విడాకులు ఇచ్చిన తర్వాత రష్యాకు చెందిన అన్నా లెజనోవాను పవన్ మూడో పెళ్లి చేసుకున్నాడు.
    • పవన్ హీరోనే కాకుండా డైరెక్టర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, రచయితగా, సింగర్‌గా, స్టంట్‌ కోఆర్టినేటర్‌గా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా ఇండస్ట్రీలో రాణించాడు. పవన్ ఇండస్ట్రీ వర్గాలతో చాలా సన్నిహితంగా ఉంటాడు. ‘అర్జున్‌’ పైరసీ సమయంలో మహేష్ బాబుకు పవన్ మద్దతుగా నిలిచాడు. ఇండస్ట్రీలో హీరో వెంకటేష్, మహేష్ బాబు, రవితేజలతో పవన్ చాలా సన్నిహితంగా ఉంటాడు.
    • పవన్ సినిమాలతోపాటు సేవా కార్యక్రమాల్లోనూ ఎప్పుడు ముందుంటాడు. ప్రకృతి విపత్తుల సమయంలో కోట్లలో విరాళాలు ఇస్తుంటాడు. పవన్ కు సినిమాల్లో ఎంతో క్రేజీ ఉన్న అవార్డులు మాత్రం ఆయనకు పెద్దగా వరించలేదు. ఆయనకు కేవలం ఒకే ఒక్క ఫిలీం ఫేర్ అవార్డు వచ్చింది.
    • జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ రాజకీయ సెలబ్రెటీల్లో టాప్ ప్లేసులో ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో అత్యధిక మంది సెర్చ్ చేసిన పొలిటిషన్ గా పవన్ కల్యాణ్ నిలిచాడని గూగుల్ వెల్లడించింది.