పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ఫుల్ బీజీగా మారాడు. వరుసగా నాలుగైదు సినిమాల్లో నటిస్తున్నట్లు ప్రకటించి అభిమానుల్లో జోష్ నింపాడు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ మూవీలో నటిస్తున్నాడు. బాలీవుడ్లో సూపర్ హిట్టయిన ‘పింక్’ ను తెలుగులో నిర్మాత దిల్ రాజు.. శ్రీదేవి భర్త బోనికపూర్ నిర్మిస్తున్నాడు.
Also Read: సోలో రిస్క్ కు సిద్ధమవుతున్న సాయిధరమ్ తేజ్..!
‘వకీల్ సాబ్’ తర్వాత పవన్ కల్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఓ మూవీ.. హరీష్ శంకర్ డైరెక్షన్లో మూవీ చేస్తాడనే ప్రచారం జరిగింది. దీంతోపాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ నటిస్తాడని ప్రచారం టాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా సాగింది. అయితే అనుహ్యంగా పవన్ కల్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
‘వకీల్ సాబ్’ తర్వాత ముందుగా పట్టాలెక్కబోయే మూవీ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ అనే టాక్ విన్పిస్తోంది. ఈ మూవీకి పవన్ 30రోజుల కాల్షీట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ రీమేక్ మూవీకి దర్శకుడు త్రివిక్రమ్ సహకారం అందిస్తుండగా విశేషం. ఇందుకుగాను ఆయనకు 10కోట్ల పారితోషికం ముట్టనుందనే ప్రచారం జరుగుతుండటం అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.
Also Read: కేసీఆర్ కు విధేయత చూపిస్తున్న టాలీవుడ్..!
ఈ రీమేక్ చిత్రానికి త్రివిక్రమ్ రచన సహకారం పెద్దగా అవసరం లేకపోయినా పనిగట్టుకొని ఆయనను ఈ సినిమాలో భాగస్వామ్యం చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మూవీలో పవన్ నటించే పాత్ర ఆయన ఇమేజ్ సరిపోదని ఫ్యాన్స్ అంటున్నారు. దీనికితోడు త్రివిక్రమ్ డైలాగ్స్ అంటూ నానా హంగామా చేస్తే ఈ రీమేక్ కాస్తా రాంగ్ ట్రాక్ లోకి వెళ్లడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది.
‘అయ్యప్పనుమ్ కోశియుమ్’లో పవన్ సరసన సాయిపల్లవి నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇక పవన్ సినిమాలో త్రివిక్రమ్ డైలాగ్స్ అంటే తనదైన మార్క్ కన్పించడం ఖాయం. త్రివిక్రమ్ రచన అందించడం బాగున్నప్పటికీ ఒరిజినల్ వర్షన్స్ దెబ్బతినేలా ఉంటే మాత్రం సినిమా రాంగ్ రూట్ వెళ్లడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది. ఈ సినిమా స్క్రీప్ట్ విషయంలో త్రివిక్రమ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనేది వేచిచూడాల్సిందే..!
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్