సోలో రిస్క్ కు సిద్ధమవుతున్న సాయిధరమ్ తేజ్..!

థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి కేంద్రం ప్రభుత్వం అక్టోబర్ 15నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50శాతం అక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా నిర్వాహాకులు మాత్రం ఓపెన్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడంలేదు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టకపోవడం.. ప్రభుత్వ నిబంధనలు అమలు చేయడం వల్ల నిర్వాహాకులు నష్టపోయే ప్రమాదం ఉండటంతో పూర్తిస్థాయిలో థియేటర్లు ఓపెన్ కావడం లేదు. Also Read: కేసీఆర్ కు విధేయత చూపిస్తున్న టాలీవుడ్..! అయితే సంక్రాంతి వరకు […]

Written By: NARESH, Updated On : November 25, 2020 5:55 pm
Follow us on

థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి కేంద్రం ప్రభుత్వం అక్టోబర్ 15నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50శాతం అక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా నిర్వాహాకులు మాత్రం ఓపెన్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడంలేదు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టకపోవడం.. ప్రభుత్వ నిబంధనలు అమలు చేయడం వల్ల నిర్వాహాకులు నష్టపోయే ప్రమాదం ఉండటంతో పూర్తిస్థాయిలో థియేటర్లు ఓపెన్ కావడం లేదు.

Also Read: కేసీఆర్ కు విధేయత చూపిస్తున్న టాలీవుడ్..!

అయితే సంక్రాంతి వరకు థియేటర్లు పూర్తి స్థాయిలో రన్ అయ్యేలా కన్పిస్తున్నాయి. దీంతో సంక్రాంతి రేసులో నిలిచేందుకు చాలా సినిమాలు పోటీపడుతున్నాయి. అయితే మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ మాత్రం అందరికీ కంటే ముందుగా వచ్చేందుకు సన్నహాలు చేసుకుంటున్నాడు. డిసెంబర్ నెలలోనే ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సాయితేజ్ సిద్ధపడుతున్నారు.

సాయిధరమ్ తేజ్ నటించిన ‘ప్రతిరోజూ పండగే’ మూవీ గతేడాది డిసెంబర్లో రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ సాయితేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సిద్ధపడుతున్నాడు. సంక్రాంతికి అన్ని సినిమాతోపాటు వచ్చే కంటే థియేటర్లు ఖాళీగా ఉన్న సమయంలో రిలీజ్ చేస్తేనే బెటర్ అని ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం సగం ఆక్యుపెన్సీతో సినిమాలు నడుస్తున్నా.. కరోనాకు భయపడని వారంతా థియేటర్లు రానుండటం సినిమాకు ప్లస్ అయ్యేలా కన్పిస్తుంది.

Also Read: ఓటీటీనే సినిమా ఇండస్ట్రీని కాపాడుతోందా?

ఈ సినిమా సర్వ హక్కులను ఇప్పటికే జీ సంస్థ ముందే దక్కించుకుంది. దీంతో ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేసినా పెద్దగా నష్టపోయేది ఏమిలేకపోవడంతో చిత్రయూనిట్ రిస్కు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓటీటీలో రిలీజుకు ముందు థియేటర్లలో ఈ సినిమాను ప్రయోగాత్మకంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ థియేటర్లలో విడుదలైన రెండు.. మూడు వారాలకే ఈ సినిమా ఓటీటీలో రిలీజు కానుంది. ఈ ప్రయోగం సక్సస్ అయితే మాత్రం థియేటర్లలో సినిమాలు క్యూ కట్టడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్