https://oktelugu.com/

బాపురే అనిపిస్తున్న మహేష్ క్రేజ్.. ఫ్యాన్స్ ఫిదా..!

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాలో మహేష్ బాబు సినిమా రిలీజ్ అయిదంటే చాలు బొమ్మదద్దరిల్లి పోవాల్సిందే. సినిమా టాక్ తో సంబంధం లేకుండా మొదటి వారంలోనే కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. సినిమాలతో ఎన్నో రికార్డులను కొల్లగొట్టే మహేష్ తాజాగా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. Also Read: పవన్ రీమేక్ చిత్రం.. త్రివిక్రమ్ స్టైల్లో మారనుందా? మహేష్ బాబుకు తెలుగుతోపాటు మిగతా భాషల్లోనూ డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 25, 2020 / 05:31 PM IST
    Follow us on

    సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాలో మహేష్ బాబు సినిమా రిలీజ్ అయిదంటే చాలు బొమ్మదద్దరిల్లి పోవాల్సిందే. సినిమా టాక్ తో సంబంధం లేకుండా మొదటి వారంలోనే కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. సినిమాలతో ఎన్నో రికార్డులను కొల్లగొట్టే మహేష్ తాజాగా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు.

    Also Read: పవన్ రీమేక్ చిత్రం.. త్రివిక్రమ్ స్టైల్లో మారనుందా?

    మహేష్ బాబుకు తెలుగుతోపాటు మిగతా భాషల్లోనూ డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవలే మహేష్ నటించిన ‘సరిలేరునీకెవ్వరు’ మూవీ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. తాజాగా మహేష్ బాబు ‘సర్కారువారిపాట’ మూవీలో నటిస్తున్నాడు. పర్శురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. దీంతో ఈ మూవీపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

    మహేష్ బాబు సినిమాలతో ఎంత బీజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటున్నారు. తమ సినిమా మచ్చట్లతో ఫ్యామిలీకి సంబంధించిన పిక్స్.. వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. దీంతో సోషల్ మీడియాలోనూ అతని ఫ్యాన్ ఫాలోయింగ్ రోజురోజుకు భారీగా పెరిగిపోతుంది.

    Also Read: సోలో రిస్క్ కు సిద్ధమవుతున్న సాయిధరమ్ తేజ్..!

    మహేష్ బాబు ఎక్కువగా ట్వీటర్లో.. ఇన్ స్ట్రాలో యాక్టివ్ ఉంటున్నాడు. ట్వీటర్లో మహేష్ ఫాలోవర్స్ సంఖ్య 10.9మిలియన్ దాటింది. సౌత్ హీరోల్లోనే ట్వీటర్లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన స్టార్ మహేష్ బాబే కావడం విశేషం. తాజాగా ఇన్ స్ట్రాలోనూ 6మిలియన్ ఫాలోవర్స్ ను దక్కించుకున్నాడు. దీంతో ఈ న్యూస్ ను అభిమానులు వైరల్ చేస్తున్నారు. మహేష్ సోషల్ మీడియాలోనూ తనకెవరూ సరిలేరని నిరూపించుకుంటుండటంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్