East Godavari: తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ మండలం బూరుగుపూడి గేటు వద్ద ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఇక్కడ గత ఆదివారం నుంచి భారీ ఎత్తున పార్టీ జరుగుతోంది. చాలావరకు కార్లు ఈ ఫంక్షన్ హాల్ వద్దకు వచ్చి ఉన్నాయి.. పెద్ద పెద్ద వ్యక్తులు రావడంతో.. ఖరీదైన పార్టీ అని చాలామంది అనుకున్నారు. డిజె సౌండ్.. మద్యం.. వంటకాలతో పార్టీ మొత్తం హోరెత్తిపోయింది. అంతవరకు ఉంటే బాగానే ఉండు. కానీ ఫంక్షన్ హాల్ నిర్వాహకులు మరో విధమైన పార్టీగా దానిని మార్చారు. వేరే ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చారు. అది కాస్త దారుణమైన వ్యవహారంగా మారడం.. చుట్టుపక్కల వాళ్లకు ఈ విషయం తెలియడంతో పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్లిన పోలీసులకు దిగ్బ్రాంతి కరమైన దృశ్యాలు కనిపించాయి. అక్కడ మద్యం సీసాలు.. బిర్యానీ, మాంసం వంటకాలు.. మత్తు కోసం వాడే పదార్థాలు.. చెప్పడానికి వీలు లేని తీరుగా ఉన్న అమ్మాయిలు పోలీసులకు కనిపించారు. దీంతో వెంటనే వారు ఆ అమ్మాయిలను, వారిని తీసుకొచ్చిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నేరుగా పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించింది.. అయితే ఈ వ్యవహారంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయగా దిగ్బ్రాంతి కరమైన వాస్తవాలు వెలుగు చూశాయి.
పార్టీ నిర్వహిస్తున్నారు
తూర్పుగోదావరి జిల్లాలో బడా బాబులను లక్ష్యంగా చేసుకొని ఈ ఫంక్షన్ హాల్ నిర్వాహకుడు భారీ ఎత్తున పార్టీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.. స్థానికంగా ఉన్న వ్యాపారులు మాత్రమే కాకుండా రాజమండ్రి ప్రాంతానికి చెందిన యువకులను కూడా ఇక్కడికి పిలిచినట్టు తెలుస్తోంది.. యువతులు గుంటూరు జిల్లాకు చెందిన వారిని.. వారితోనే దారుణమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని సమాచారం. ఈ పార్టీకి హాజరవడానికి ఒక్కొకరి దగ్గర భారీగానే వసూలు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ పార్టీకి హాజరైన యువకుల్లో కొంతమంది డీజే కావాలని కోరడం.. పైగా వారు మద్యం మత్తులో ఉండడంతో.. ఈ విషయం బయటికి పొక్కింది. తమకు తెలియని యువతులు ఫంక్షన్ హాల్లో కనిపించడం.. వారంతా కూడా చిత్ర విచిత్రమైన వేషధారణలో ఉండడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఫంక్షన్ హాల్ యజమాని కుమారుడి ని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు ప్రాంతానికి చెందిన యువతులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఆ యువతులు మద్యం మత్తులో ఉన్నారని తెలుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న మిగతా యువకులు కూడా మైకంలో ఉన్నారని.. అది దిగిన తర్వాత వారు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే ఈ విషయం తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించింది. గుంటూరు యువతులు ఈ పార్టీలో ఉన్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆ యువతుల గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితేవారు ఇటువంటి పార్టీలకు వెళ్తుంటారని.. రాయడానికి వీలు లేని విధమైన వ్యవహారాలలో పాలుపంచుకుంటారని తెలుస్తోంది.. మరొక రోజులో నూతన సంవత్సరం ప్రవేశిస్తున్న నేపథ్యంలో… తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం.