Pawan Kalyan : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం పై ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు సుదీర్ఘంగా 17 నిమిషాల పాటు మీడియా సమావేశం లో మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటలను సరైన పద్దతిలో కాకుండా, ఎవరికీ తోచినట్టు వాళ్ళు చెప్పుకొచ్చారు. కొంతమంది అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా మాట్లాడాడని, మరికొంతమంది అల్లు అర్జున్ కి సపోర్టుగా మాట్లాడాడని, ఇలా ఎవరికీ ఇష్టమొచ్చినట్టు వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకున్నారు. కానీ కాసేపటి క్రితమే నేడు ఆయన వివిధ అంశాల మీద మీడియా తో ‘ఇష్టా గోష్ఠి’ సమావేశం ని ఏర్పాటు చేసాడు. ఈ సమావేశం లో అల్లు అర్జున్ గురించి వాస్తవంగా ఆయన ఏమి మాట్లాడాడో తెలిసింది. గోటితో పోయేదానిని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు అని పవన్ కళ్యాణ్ అన్నాడంటూ ఉదయం మీడియాలో వచ్చిన వార్త నిజమే. కానీ ఆయన చెప్పిన సందర్భం వేరు.
ఆయన ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం..’ఈ విషయం లో ముందు ఏమి జరిగింది, ఆ తర్వాత ఏమి జరిగింది అనేది నాకు తెలియదు. కానీ నేను గమనించిన దానిని బట్టి చెప్తాను. ఏ హీరో కి అయినా తమ సినిమాని ఆడియన్స్ తో కలిసి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని కోరిక ఉంటుంది. ఎందుకంటే అలా చూసినప్పుడే, వాళ్ళ రియాక్షన్స్ ని బట్టే ఒక నటుడు తన తదుపరి సినిమాలో ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనేది నిర్ణయించుకుంటాడు. గతంలో అన్నయ్య చిరంజీవి కూడా ఆయన సినిమాలకు ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకోవడానికి మాస్క్ వేసుకొని థియేటర్ కి వెళ్ళేవాడు. నేను కూడా మొదటి మూడు సినిమాలు చూసాను. అదే విధంగా ఒక సినిమా థియేటర్ కి తమ అభిమాన హీరో వస్తున్నాడు అని తెలిస్తే, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు అవ్వడం సహజమే’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘వాళ్ళు అలా వచ్చినప్పుడు మనం వాళ్లకి అభివాదం చేయకపోతే చాలా పొగరు అనుకుంటారు. కానీ ఇక్కడ జరిగిన పొరపాటు ఏమిటంటే థియేటర్ లో కూర్చొని సినిమా చూస్తున్న అల్లు అర్జున్ కి బయట ఏమి జరిగిందో తెలియదు. అతనికి పరిస్థితి ని వివరించాల్సిన బాధ్యత అతని స్టాఫ్ ది. అదే విధంగా ఘటన జరిగిన మరుసటి రోజే, అల్లు అర్జున్ గారు కాకపోయినా, ఆ సినిమాకి పని చేసిన యూనిట్ సభ్యులు చనిపోయిన రేవతి గారి కుటుంబాన్ని వెళ్లి పరామర్శించి, వాళ్లకు ధైర్యం చెప్పాల్సింది. అది జరగలేదు, అదే చేసి ఉండుంటే ఈరోజు ఇంత పెద్ద గొడవ అయ్యేది కాదు. ఈ విషయంలో అల్లు అర్జున్ ని పాపం అందరూ ఒంటరి వాడిని చేసేసారు. తప్పు మొత్తం అతని వైపుకు నెట్టేశారు, అది నాకు కరెక్ట్ అనిపించలేదు’ అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. ఆయన ఏమి మాట్లాడాడో ఒకసారి ఈ క్రింది వీడియో ని చూసి తెలుసుకోండి.
Probably the most honest & balanced analysis anyone has done on the Sandhya theatre stampede issue. Check out # PawanKalyan’s detailed analysis & take on the issue. pic.twitter.com/1DrDkTclyi
— Aakashavaani (@TheAakashavaani) December 30, 2024