https://oktelugu.com/

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ లో దుమ్ములేచిపోయే రేంజ్ ఐటెం సాంగ్..తళుక్కుమని మెరవబోతున్న 1000 కోట్ల హీరోయిన్!

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న చిత్రం 'ఓజీ'.

Written By:
  • Vicky
  • , Updated On : December 7, 2024 / 04:24 PM IST

    Pawan Kalyan

    Follow us on

    Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న చిత్రం ‘ఓజీ’. ప్రముఖ యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదటి నుండే అంచనాలు భారీ రేంజ్ లో ఉండేవి. ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించిన రోజు సోషల్ మీడియా మొత్తం ఊగిపోయింది. సెలెబ్రిటీలు సైతం ఎంతో ఉత్సాహంతో ఈ సినిమా గురించి ట్వీట్లు వేస్తూ పవన్ కళ్యాణ్ కి, మూవీ టీం కి శుభాకాంక్షలు తెలియచేసారు. ఇక గత ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా గ్లిమ్స్ వీడియో కి వేరే లెవెల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే రీసెంట్ సమయంలో విడుదలైన టీజర్స్ ఏవీ కూడా ఓజీ గ్లిమ్స్ వీడియో ని మ్యాచ్ చేయలేకపోయాయి.

    కేవలం గ్లిమ్స్ వీడియో తప్ప, ఈ సినిమా నుండి మరో అప్డేట్ రాలేదు. అయినప్పటికీ కూడా ఈ చిత్రం అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో తెలియదు, కానీ అప్పుడే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ హాట్ కేక్ లాగా అమ్ముడుపోయింది. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయలకు పైగా థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమా ఇప్పటి వరకు 80 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ బిజీ అవ్వడం, ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అవ్వడం వల్ల కొంతకాలం షూటింగ్ కి బ్రేక్ పడింది. రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలను మళ్ళీ ప్రారంభించుకోగా, పవన్ కళ్యాణ్ లేని కొన్ని యాక్షన్ సన్నివేశాలను, ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హీన్స్ సారథ్యంలో చిత్రీకరించాడు డైరెక్టర్ సుజిత్. పవన్ కళ్యాణ్ ఈ చిత్రం కోసం జనవరి, ఫిబ్రవరి నెలల్లో డేట్స్ కేటాయించాడు.

    ఆయనకు సంబంధించి కేవలం 25 రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉంది. వచ్చే వారం నుండి పవన్ కళ్యాణ్ లేకుండా బ్యాంకాక్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనుంది మూవీ టీమ్. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ ని కూడా ప్లాన్ చేసాడట డైరెక్టర్ సుజిత్. ఈ ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ ని సంప్రదించారట. ఈమెకు బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ సాధారణమైనది కాదు. కొంతమంది స్టార్ హీరోలకు కూడా ఈమె రేంజ్ ఫాలోయింగ్ లేదు. రీసెంట్ గానే ఈమె ‘స్త్రీ 2’ చిత్రంతో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది. ఈమె తెలుగు లో ప్రభాస్ నటించిన ‘సాహూ’ లో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కూడా సుజిత్ దర్శకత్వం వహించాడు. ఒక సినిమా ఆయనతో కలిసి పనిచేసిన అనుభవం ఉండడంతో ఆయన అడిగిన వెంటనే డేట్స్ ఇవ్వడానికి ఒప్పుకుందట శ్రద్దా కపూర్. త్వరలోనే ఈ పాటని గ్రాండ్ స్కేల్ లో చిత్రీకరించనున్నారు మేకర్స్.