Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10వ తారీఖున తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ‘రంగస్థలం’, ‘వినయ విధేయ రామ’ చిత్రాల తర్వాత, రామ్ చరణ్ నుండి వస్తున్న సోలో హీరో చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. అంతే కాకుండా ఇటీవల విడుదలైన టీజర్ కూడా సినిమా పై మంచి అంచనాలను పెంచింది. ‘ఇండియన్ 2’ చిత్రం తర్వాత శంకర్ పని ఇక అయిపోయింది అని అంతా అనుకుంటున్న అభిమానులకు ఈ సినిమా టీజర్ ఇచ్చిన ధైర్యం మామూలుది కాదు. వింటేజ్ శంకర్ మార్క్ కమర్షియల్ సినిమాలు ఎలా ఉంటాయో, ఈ సినిమా కూడా అలా ఉన్నట్టుగా ఈ టీజర్ ని చూసినప్పుడు అనిపించింది.
రీసెంట్ గా విడుదలైన ‘నానా హైరానా’ లిరికల్ వీడియో సాంగ్ కి కూడా ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతకు ముందు విడుదలైన ‘జరగండి జరగండి’, ‘రా మచ్చ..మచ్చ’ పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలా ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి బంపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ కి తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ లండన్ లో ప్రారంభించారు. బుకింగ్స్ ప్రారంభించిన వెంటనే టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బుకింగ్స్ ప్రారంభించిన 24 గంటల్లో 3700 టిక్కెట్లు అమ్ముడుపోయాయట. ఇది టాలీవుడ్ హిస్టరీ లోనే ఆల్ టైం రికార్డుగా పరిగణిస్తున్నారు మేకర్స్. ఈ చిత్రానికి ముందు రెండు స్థానాల్లో ‘పుష్ప 2’, ‘దేవర’ చిత్రాలు నిలిచాయి.
అక్కడి ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ‘దేవర’ చిత్రానికి 24 గంటల్లో 2300 టికెట్స్ అమ్ముడుపోగా, ‘పుష్ప 2’ చిత్రానికి 24 గంటల్లో 2500 టికెట్స్ అమ్ముడుపోయాయి. కాసేపటి క్రితమే కొన్ని మెయిన్ లొకేషన్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా, అవి కూడా దాదాపుగా హౌస్ ఫుల్స్ అయ్యినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటి వరకు 5 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. ట్రెండ్ చూస్తూ ఉంటే ‘గేమ్ చేంజర్’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రతీ చోట ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పేలా ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఇంకెన్ని అద్భుతాలు సృష్టించబోతుందో చూడాలి. శంకర్ కి తమిళం లో కూడా మంచి క్రేజ్ ఉండడంతో ఈ సినిమాకి కోలీవుడ్ లో కూడా మంచి హైప్ ఉంది. టాక్ వస్తే కేవలం తమిళనాడు ప్రాంతం నుండే ఈ చిత్రం వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబడుతుందని అంచనా వేస్తున్నారు.